శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా -2. రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీ సింహ కోడూరి మరియు సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌గానిలిచింది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read : Nani : ముచ్చటగా ముడోసారి ‘నాని – సాయి పల్లవి’.. దర్శకుడు ఎవరంటే..?
తాజగా ఈ సినిమా చుసిన మెగాస్టార్ చిరంజీవి ” నిన్ననే ‘మత్తు వదలరా – 2’ చూసాను.ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. ఎండ్ టైటిల్స్ ను కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు రితేష్ రాణా కి ఇవ్వాలి. అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేము. హ్యాట్స్ ఆఫ్ టు రితేష్ రాణా. అలాగే చిత్ర నటీ నటులకు ,సింహ కోడూరికి , ప్రత్యేకించి కమెడియన్ సత్యకు నా అభినందనలు. అలాగే మంచి విజయాన్ని అందుకున్నమైత్రీ సంస్థకు, టీం అందరికీ నా అభినందనలు” అని ‘X’ లో పోస్ట్ చేశారు.
ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు ” మత్తు వదలరా 2′ నవ్వుల ప్రవాహం, సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, సినిమా చూసేతప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను, హీరో శ్రీ సింహతో పాటు మిగిలిన నటీనటులు అద్భుతంగా నటించారు, “వెన్నెల కిశోర్ నువ్వు స్క్రీన్ మీద కనిపించినంత సేపు నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. సత్య నువ్వు సినిమాలో కనిపించినప్పుడల్లా మేమంతా నవ్వకుండా ఉండలేకపోయాం. మీరు అద్భుతంగా నటించారు. టీమ్ మొత్తానికి అభినందనలు” అంటూ మహేశ్ బాబు మూవీ టీమ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేసారు.
నిన్ననే 'మత్తు వదలరా – 2' చూసాను.
ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణా కి ఇవ్వాలి.
అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది
చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 15, 2024
#MathuVadalara2… a laugh riot!! 🤣🤣🤣 Thoroughly enjoyed it.. Effortless performances by @Simhakoduri23 and the entire cast! #VennelaKishore… my daughter couldn’t stop laughing when you were on screen 😁 #Satya… we all couldn’t stop laughing when you were on screen……
— Mahesh Babu (@urstrulyMahesh) September 14, 2024