KKR vs RCB: మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ఏంటి పరిస్థితి..?
- 2025 ఐపీఎల్ సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం
- మొదటి మ్యాచ్ కోల్‌కతా-బెంగళూరు మధ్య మ్యాచ్
- ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు
- మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితులు ఎక్కువ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 ఐపీఎల్ సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. వాతావరణం మార్పుల వల్ల ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ప్రస్తుతం కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ రోజు కోల్‌కతాలో వర్షం పడే అవకాశం 90% ఉందని పేర్కొంది. దీని వల్ల మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే..?
ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌లు, ఫైనల్‌లకు మాత్రమే రిజర్వ్ డే ఉంది. గ్రూప్ మ్యాచ్‌లకు ఎలాంటి రిజర్వ్ డే లేదు. ఈ క్రమంలో.. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే రెండు జట్లకు చెరో 2 పాయింట్లు ఇవ్వనున్నారు. ఐపీఎల్ నియమాల ప్రకారం.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఆటను 60 నిమిషాల వరకు పొడిగించేందుకు ప్రయత్నిస్తారు. మ్యాచ్ ఫలితం కోసం కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. 5-5 ఓవర్ల మ్యాచ్‌ను జరిగించడానికి కట్-ఆఫ్ సమయం IST కాలమానం ప్రకారం రాత్రి 10:56 గంటలు, ఆట మరుసటి రోజు ఉదయం 12:06 గంటల వరకు వేచి చూస్తారు. అప్పుడు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోతే ఇరు జట్లకు పాయింట్లు ఇస్తారు.
కోల్‌కతా-బెంగళూరుకు కొత్త కెప్టెన్లు:
ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్నాయి. కోల్‌కతా జట్టు కెప్టెన్సీని సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు అప్పగించగా.. బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహించనున్నారు. ఈ కొత్త కెప్టెన్లు తమ జట్లకు ఎలాంటి ఫ్యాన్స్ మధ్య కొత్త ఆశలను తలెత్తిస్తోంది.
KKR:
అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్ (వైస్-కెప్టెన్), మొయిన్ అలీ, వైభవ్ అరోరా, క్వింటన్ డి కాక్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, మయాంక్ మార్కండే, సునీల్ నరైన్, అన్రిచ్ నోర్ట్జే, మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రహ్మానుల్లా గుర్బాజ్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, చేతన్ సకారియా, రింకు సింగ్, లావ్‌నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి.
RCB:
రజత్ పాటిదార్ (కెప్టెన్), అభినందన్ సింగ్, జాకబ్ బెథెల్, మనోజ్ భండాగే, స్వస్తిక్ చికారా, టిమ్ డేవిడ్, జోష్ హాజిల్‌వుడ్, విరాట్ కోహ్లీ , భువనేశ్వర్ కుమార్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రాఠి, లుంగీ న్గిడి, దేవ్‌దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, రసిక్ సలాం, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, సుయాష్ శర్మ, స్వప్నిల్ సింగ్, నువాన్ తుషార, యష్ దయాళ్.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!