Vishvambhara : మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో డిజాస్టర్ అందుకున్న ఆయన చాలా గ్యాప్ తీసుకున్నారు. అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకుని తన తర్వాతి సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చేస్తున్నారు. విశ్వంభర టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. విజువల్ ట్రీట్గా రూపొందుతున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మామూలుగా అయితే విశ్వంభర మొన్న సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేటవడం వల్ల విడుదల వాయిదా పడింది. తర్వాత మళ్లీ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని ఇప్పటి వరకు మేకర్స్ అనౌన్స్ చేయలేదు.
Read Also:Seethakka: వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలి.. అధికారులకు మంత్రి ఆదేశం
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓ వైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే.. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలతో పాటూ ఆడియో వర్క్స్ ను కూడా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని తెలుస్తోంది. థియేటర్లలో ఈ సాంగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తాయని డైరెక్టర్ వశిష్ఠ వెల్లడించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ రామ అంటూ సాగే పాట అదిరిపోయింది. రీసెంట్ గానే ఆ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ పాటలో చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గ తేజ్ స్పెషల్ అప్పియరెన్స్ కూడా ఉండనుందని సమాచారం. విశ్వంభర ఫస్ట్ లిరికల్ గా ఈ సాంగ్‌నే విడుదల చేసే అవకాశం ఉందని చిత్ర యూనిట్ వర్గాల నుంచి లీకులు అందుతున్నాయి. కీరవాణి, చిరంజీవి కాంబినేషన్లో రానున్న ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్ చేస్తుందని సమాచారం. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also:Jagapati Babu : ఫోటో ఇచ్చి అందరికీ పనిచెప్పిన జగ్గూ భాయ్