Kishan Reddy : ఎన్నికల ఎత్తుగడలో కొంతవరకు విఫలమయ్యాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలందరూ ఎంతో కష్టపడ్డారని, ఎన్నికల్లో నరేంద్ర మోదీ నీ బిజెపి ని ఓడించాలనీ దేశ వ్యాప్తంగా కొన్ని అంతర్జాతీయ శక్తులు కుట్ర చేశాయన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని రెండు నియోజకవర్గాల్లో బిజెపి వ్యతిరేక శక్తులు (కాంగ్రెస్, ఎంఐఎం) ఏకమయ్యాయని, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (జూబ్లీహిల్స్, నాంపల్లి) బీజేపీకి మెజారిటీ రాలేదని ఆయన అన్నారు.
అంతేకాకుండా..’నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రూపంలో మజ్లిస్ పార్టీ పోటీచేసింది. కాంగ్రెస్ పార్టీ గుర్తు కోసం, కాంగ్రెస్ పార్టీ జెండా కింద మజ్లిస్ పార్టీ పనిచేసింది. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎంతో అవగాహనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారమే నిర్వహించలేదు. పాదయాత్ర చేయలే.. సమావేశాలు నిర్వహించలేదు. భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఎన్నికల ఎత్తుగడలో కొంతవరకు విఫలమయ్యాం. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 62 వేల ఓట్లు తగ్గాయి. ఆ ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. అయినా ప్రజల మద్దతుతో బీజేపీకి గతం కంటే ఓటింగ్ శాతం పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారిపై ప్రపంచంలోని వివిధ దేశాధినేతలు ఆదరిస్తున్నారు. దీన్ని రాజకీయంగా జీర్ణించుకోలేని కొన్ని శక్తులు కుట్రలకు తెరలేపాయి. వికసిత్ భారత్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో ఎన్డీయేకు వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ శక్తులు చాపకింద నీరులాగా పనిచేస్తున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, హ్యాట్రిక్ ప్రధానిగా పదవి అలంకిరించిన ఘనత నరేంద్ర మోదీదే’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!