Bhatti Vikramarka : సీఎం రేవంత్ రెడ్డిది గొప్ప సంస్కారం.. భట్టి ప్రశంసలు
- 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై అభినందనలు
- ప్రజా సంక్షేమమే సీఎం లక్ష్యమన్న భట్టి
- సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై ప్రశంసలు
- క్షేత్రస్థాయి పాలనకు భట్టి కితాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మిడ్జిల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రెండు దశాబ్దాల క్రితం తనను జడ్పీటీసీగా దీవించిన ఈ ప్రాంత ప్రజల చెంతకు, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మారి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి రావడం రేవంత్ రెడ్డి గారి ఉన్నతమైన సంస్కారానికి నిదర్శనమని కొనియాడారు. కేవలం అధికారుల సలహాలకే పరిమితం కాకుండా, పేదోడి కష్టాలు స్వయంగా తెలిసిన నాయకుడిగా రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో అద్భుతమైన ప్రజాపాలన అందిస్తున్నారని, ప్రకృతి కూడా ఆశీర్వదించేంత మంచి సంకల్పంతో ఆయన నిరంతరం ప్రజల కోసమే పరితపిస్తున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే అజెండాగా చారిత్రాత్మక నిర్ణయాలు
రాష్ట్రంలో ఆకలి లేని సమాజమే లక్ష్యంగా కోటి పదిహేను లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, అలాగే 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లో పౌష్టికాహారం అందించడం ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుతోందని భట్టి విక్రమార్క వివరించారు. నిరుపేదలకు అండగా ఇందిరమ్మ ఇళ్లు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అక్కాచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ప్రజా సంక్షేమమే అజెండాగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గత పాలకుల హయాంలో నిరంతరం భయంతో బతికిన తెలంగాణ ప్రజలకు, నేడు నిజమైన స్వేచ్ఛా స్వతంత్ర జీవనాన్ని ప్రసాదించిన ధీశాలి రేవంత్ రెడ్డి అని డిప్యూటీ సీఎం కొనియాడారు.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!