TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- విడుదలైన TGEAPCET మాక్ సీట్ల కేటాయింపు
- 8,740 మందికి సీట్లు దక్కని పరిస్థితి
- కంప్యూటర్ కోర్సులకు భారీ డిమాండ్
- జూలై 7లోపు వెబ్ ఆప్షన్లు మార్చుకునే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ టీజీఈఏపీసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్లో భాగంగా అభ్యర్థుల అవగాహన కోసం అధికారులు మాక్ సీట్ల కేటాయింపు (Mock Seat Allotment) ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యకు, అందుబాటులో ఉన్న సీట్లకు మధ్య గట్టి పోటీ నెలకొంది. మొత్తం 88,053 సీట్లు అందుబాటులో ఉండగా, 88,062 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో మాక్ అలాట్మెంట్లో 79,313 మందికి సీట్లు లభించగా, ఆప్షన్లు ఇచ్చుకున్నప్పటికీ సరైన కట్-ఆఫ్ లేకపోవడం వల్ల 8,740 మంది అభ్యర్థులకు సీట్లు దక్కలేదు. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేటాయించిన ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా కింద 6,261 మంది అభ్యర్థులకు మాక్ సీట్లు కేటాయించారు. అయితే, ఈ మాక్ కేటాయింపులు కేవలం తాత్కాలికమేనని, అభ్యర్థులు తమ ఆప్షన్ల సరళిని సరిచూసుకోవడానికి మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. జూలై 5 నుండి 7 వ తేదీ వరకు అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను మార్చుకోవడానికి లేదా మరిన్ని కొత్త ఆప్షన్లను జోడించుకోవడానికి అవకాశం కల్పించారు. జూలై 7న ఫ్రీజ్ అయ్యే ఆప్షన్ల ఆధారంగానే మొదటి విడత అసలు సీట్ల కేటాయింపు జరుగుతుంది. కాగా, ఈ మాక్ కేటాయింపులో ఎన్సీసీ (NCC), స్పోర్ట్స్ కోటా సీట్లను పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రైవేట్ వర్సిటీల్లో ఫుల్ రష్.. కంప్యూటర్ కోర్సులకు భారీ డిమాండ్
మాక్ కేటాయింపుల సరళిని పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇంజినీరింగ్ సీట్లలో 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో ప్రైవేట్ యూనివర్సిటీలు అత్యధిక ఆదరణ పొందుతూ 100 శాతం సీట్ల భర్తీని నమోదు చేయగా, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 90 శాతం, ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీల్లో 85 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఎప్పటిలాగే కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల వైపు ఎక్కువగా మొగ్గు చూపడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ వంటి ప్రత్యేక కోర్సుల్లో ఏకంగా 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. వీటితో పాటు కోర్ సీఎస్ఈ (CSE) లో 95 శాతం, సీఎస్ఈ ఏఐ అండ్ ఎంఎల్ లో 93 శాతం, సీఎస్ఈ డేటా సైన్స్ లో 92 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ , కోర్ గ్రూపుల విషయానికి వస్తే ఈసీఈ (ECE) లో 89 శాతం, ఈఈఈ (EEE) లో 73 శాతం సీట్లు భర్తీ కాగా, సివిల్ ఇంజినీరింగ్‌లో 81 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 76 శాతం సీట్లు మాక్ అలాట్మెంట్లో భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో, మాక్ అలాట్మెంట్లో సీటు రాని వారు , తక్కువ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులు నిరాశ పడకుండా, మెరుగైన కాలేజీలు , కోర్సులను దక్కించుకోవడం కోసం జూలై 5 నుంచి 7 లోపు మరిన్ని ఎక్కువ ఆప్షన్లను వెబ్ కౌన్సిలింగ్లో నమోదు చేయాలని అధికారులు సూచించారు.
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!