సింగరేణి పరిస్థితి, కార్మికుల కష్టాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సింగరేణి పరిస్థితి బాగుపడాలంటే తెలంగాణ లో ప్రభుత్వం మారాలని ఆయన వెల్లడించారు. కల్వకుంట్ల ప్రభుత్వం పోవాలని, నీతి వంతమైన ప్రభుత్వం రావాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని ఏవిధంగా తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామంటూ బీఆర్ఎస్ ప్రకటించడం రాజకీయ జిమ్మిక్కు మాత్రమేనని ఆయన మండిపడ్డారు. కార్మికులకు దేవుళ్ళమంటూ కల్వకుంట్ల కుటుంబం పొలిటికల్ స్టంట్ చేస్తుందని, బొగ్గు గనులు తెలంగాణలో వేలం వేస్తుంటే అందులో పాల్గొని సింగరేణికి గనులు దక్కేలా చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు పెడతామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు.
Also Read : Johnny Nellore: కేరళ కాంగ్రెస్‌కు జానీ నెల్లూరు రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం!
కోల్ ఇండియాలో కార్మికులకు 930 రూపాయలు వేతనం ఉంటే సింగరేణిలో 420 మాత్రమే ఉందని, ఎందుకింత విపక్ష? అని ఆయన అన్నారు. కార్మిక సంఘాల ఎన్నికలున్న నేపధ్యంలోనే బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని, తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి పరిస్థితి నేడు అగమ్యగోచరంగా తయారైందని, అంతర్గత ఫ్రీవేటికరణ, ఔట్ సోర్సింగ్, అద్వనమైన ఆర్థిక వ్యవస్థ, సిబ్బంది తగింపు, గనులలో భద్రత లోపించిందన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Samantha: అప్పుడు చైతూ.. ఇప్పుడు సామ్.. ఫాన్స్ దేన్నీ వదలరుగా