10 సంవత్సరాలు BRS అధికార దుర్వినియోగం తోకక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీ లో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ లో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. కనీసం సిగ్గు లేకుండా రాజీనామా చేయకుండా మంత్రి పదవులు తీసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఎజెండా పెట్టుకుంది… పిరాయింపులకి ప్రోత్సహిస్తుందన్నారు. కుక్కలను నక్కలని కేసీఆర్ ఎందుకు టికెట్ లు ఇచ్చారో చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. ప్రజా తీర్పు పట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు గౌరవం లేదు…. ప్రజాభిప్రాయాన్ని అవమాన పరుస్తున్నారన్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ మీద గెలిచిన మీరు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక భయంకర అంశాలు తెరపైకి వస్తున్నాయని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం , కేసీఆర్ కుటుంబం బరితెగించి వ్యక్తి స్వేచ్ఛను హరించిందన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా.. ‘ఆనాటి సీఎం రిటైర్డ్ అయిన అధికారిని ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించి ఇష్టమొచ్చినట్టు వ్యవహరించారు. ఇది మామూలు విషయం కాదు… ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశ్య పూర్వకంగా వారి హక్కులను భంగం కలిగించే విధంగా కెసిఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. తెలంగాణ లో జరిగిన వివిధ ఎన్నికల సమయం లో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. ప్రతిపక్ష నేతల పోన్ లను అక్రమంగా ట్యాప్ చేసింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సందర్భంగా మా నాయకుల పోన్ లు ట్యాప్ చేశారు. పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల పోన్ లు , ప్రముఖ వ్యక్తుల పోన్ లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లకు కారణం ఎవరని కెసిఆర్ ను ప్రశ్నిస్తున్న. బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేశారని బయటపడుతుంది. బీఆర్‌ఎస్ పార్టీ డబ్బులు వసూల్ చేసినట్టు తెలుస్తుంది… కెసిఆర్ అయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు బయటపడుతుంది.
దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.. కేసీఆర్ నిజాం రాజుగా చట్టాలను పాటించకుండా ఇష్టారాజ్యంగా , తెలంగాణ ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా వాడుకున్నాడు.. దేశ సమగ్రతను భంగం కలిగించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని గవర్నర్ నీ కోరుతున్న. ఎన్నికల కమిషన్ బాధ్యత కూడా ఉంది… ఎన్నికల సమయం లో brs నేతలు నిబంధనలు ఉల్లంఘించారు… ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలి. బీఆర్‌ఎస్ గుర్తింపు పై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్న.. కేసీఆర్ పైన చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న.. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఒక షాడో సీఎం గా వ్యవహరించి ఈ రోజు కేసు వస్తె నాకేం సంబంధం అంటున్నాడు..’ అని ఆయన వ్యాఖ్యానించారు.