Kishan Reddy: దేశం బాగుండాలంటే మోడీని గెలిపించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: దేశానికి సంబంధించిన ఎన్నికలు వచ్చేనెల జరగనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవి దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలని ఆయన వెల్లడించారు. మన దేశ, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలన్నారు. ఆయన సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో ప్రచారం నిర్వహించారు. కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ.. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారన్నారు. పేదలకు ఎల్పీజీ సిలిండర్లు ఇస్తుంది మోడీనేనని ఆయన అన్నారు. పొదుపు సంఘాలకు డిపాజిట్లు లేకుండా 20 లక్షల లోన్లు ఇస్తున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ తీసుకువచ్చి పేదలకు వైద్యాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Laxman: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..
Also Read
మోడీ వచ్చారు కాబట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందన్నారు. 500 వందల ఏళ్లుగా రాముడు గుడిసెలోనే ఉన్నాడని.. స్వాత్యంత్రం వచ్చాక కూడా ఎవరు రాముడి గుడిని కట్టలేదన్నారు. మోడీ లేకపోతే దేశంలో అవినీతి, మజ్లిస్ గుండాయిజం, అరాచకాలు పెరుగుతాయని ఆయన అన్నారు. దేశం బాగుండాలంటే మోడీని గెలిపించాలన్నారు. గెలిపించాలని మిమ్మల్ని అందరిని కోరుతున్నామని ప్రచారం నిర్వహించారు. ఇక్కడ మజ్లిస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఎవరు అభివృద్ధిని ఆపిన ఆగదు.. తాను అభివృద్ధి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..