గ్రేటర్ వరంగల్, భూపాలపల్లి మోరంచపల్లిలో వరద ముంపు ప్రాంతాల్లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించారు. వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని పరిశీలించి పార్టీపరంగా నిత్యావసర సరకులు, దుప్పట్లు పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద జాతీయ విపత్తు నిధులు 914 కోట్ల వరకు ఉన్నాయన్నారు. 2021-22 సంవత్సరం వరకు 736 కోట్లు, 2022-23 లో 178 కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అయ్యాయన్నారు. ప్రస్తుతం 2023-24 సంవత్సరానికి సంబంధించిన 197 కోట్లు ఉన్నాయని, ఎల్ సి తీసుకువస్తే రాష్ట్రప్రభుత్వ అకౌంట్ లో జమ చేస్తామన్నారు. వర్షం వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నివేదిక పంపలేదని, మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వమే కేంద్ర బృందాలను పంపించిందన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Pakistan Blast: పాకిస్తాన్లో బాంబు పేలుడు.. 40 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు
కేంద్ర బృందాలు రేపటి నుంచి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తాయని, కేంద్ర బృందాలు సేకరించిన నివేదిక ప్రకారం కేంద్రం ఆదుకునే చర్యలు చేపడుతుందన్నారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు చేపట్టాలని, వరద బాధితులకు ప్రతి కుటుంబానికి నాలుగు లక్షలు ఇవ్వచ్చన్నారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో నాలుగు లక్షల సహాయంలో 75శాతం 3 లక్షలు కేంద్ర ప్రభుత్వానివేనని, వర్షం వరదలతో పంటలకు అపారం నష్టం వాటిల్లిందన్నారు కిషన్ రెడ్డి. 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంటల ఫసల్ బీమాను అమలు చేయడంలేదని, దీంతో రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
Also Read : Ram Charan: ఇండస్ట్రీకి మీరే నిజమైన గేమ్ ఛేంజర్.. చరణ్ ట్వీట్ వైరల్
2016 నుంచి 2020 వరకు పంటల బీమా పథకం ద్వారా రెండు వేలకోట్ల మేలు తెలంగాణ రైతులకు జరిగిందని, 2020 నుంచిని పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసిందన్నారు కిషన్ రెడ్డి. 2023లో ఇప్పటివరకు ఐదు లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాన పదివేలు ఇస్తామన్నారు కేసిఆర్, ఇప్పటివరకు ఇవ్వడం లేదన్నారు. ఇక నాలుగు నెలలు మాత్రమే ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పంటల పసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. వరద ముంపు ప్రాంతాల్లో బీజేపీ బృందాలు పర్యటించి నిత్యవసర సరుకులు, దుస్తులు పంపిణీ చేస్తున్నాయి. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రాజకీయాలు మాట్లాడదలచుకోలేదు, నష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి వచ్చామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.