Virat Kohli: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..
- సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
- అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 27 వేల పరుగులు సాధించిన విరాట్
- 594 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన కోహ్లీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్మెన్లు చెలరేగిపోయారు. 25 ఓవర్లలోనే భారత్ 200 పరుగులు చేసింది. టెస్టు ఇన్నింగ్స్‌లో టీమిండియా అత్యంత వేగంగా 200 పరుగులు చేయడం ఇదే మొదటి సారి. ఈ క్రమంలో.. భారత్ ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే… వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో మరో రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 27 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు. కోహ్లి 594 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
Read Also: Netanyahu- Modi: ఇజ్రాయెల్ ప్రధానికి మోడీ ఫోన్ కాల్.. తాజా పరిణామాలపై చర్చ
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
కాన్పూర్ టెస్టు నాలుగో రోజు భారత్‌కు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దూకుడు ఇన్నింగ్స్ తో మంచి ఆరంభాన్ని అందించారు. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా అదే జోరుతో బ్యాటింగ్ చేశారు. బంగ్లాదేశ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో.. టెస్టు క్రికెట్లో ఒక ఇన్నింగ్స్‌లో వేగంగా 50, ఫాస్టెస్ట్ 100, ఫాస్టెస్ట్ 150, ఫాస్టెస్ట్ 200, ఫాస్టెస్ట్ 250 పరుగులు చేసిన రికార్డులను భారత్ సృష్టించింది. ఇంతకుముందు కూడా ఫాస్టెస్ట్ 100, ఫాస్టెస్ట్ 150 రికార్డు భారతదేశం పేరిట ఉండేది.
Read Also: Kolikapudi Srinivasa Rao: తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారంలో మరో ట్విస్ట్..
అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2017లో సిడ్నీలో పాకిస్థాన్‌పై 28.1 ఓవర్లలో 200 పరుగులు చేసింది. తాజాగా.. బంగ్లాదేశ్‌పై భారత్ 148 బంతుల్లో (24.4 ఓవర్లు) 200 పరుగుల మార్క్‌ను చేరుకుంది. అత్యంత వేగంగా 50, 250 పరుగుల రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ అత్యంత వేగంగా 50 పరుగులు చేసింది. 2022లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ వేగంగా 250 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 34 ఓవర్లలో 250 పరుగులు చేసింది. భారత్ 30.1 ఓవర్లలో 250 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!