తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలోని మీరట్ ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అన్షుల్ కుమార్ కు 93.5% మార్కులు రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సమయంలో అతనికి సంతోషంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అతనిని ఐసీయూలో చేర్పించారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Acid attack: వరుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి.. అసలేం జరిగిందంటే..!
తాజాగా విడుదలైన ఉత్తరప్రదేశ్ పదవ తరగతిలో విద్యార్థులు 89.5% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా మీరట్ లోని మోడిపురం మహర్షి దయానంద్ ఇంటర్ కాలేజ్‌కు చెందిన అన్షుల్ కుమార్ కి 93.5% మార్కులు వచ్చాయి. అయితే అతనికి వచ్చిన ఫలితాన్ని చూడగానే విద్యార్థి సృహ తప్పి కింద పడిపోయాడు.
Also Read: Viral News : భర్తకు గుడి కట్టించిన భార్య.. ప్రత్యేక పూజలు కూడా..
దాంతో వెంటనే అక్కడివారు అన్షుల్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే ఆ అబ్బాయి తండ్రి ఈ విషయాన్ని తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం అన్షుల్ పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.