ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఓ తండ్రి ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు హిరణ్య (9), లీలసాయి (7)గా గుర్తించారు. అయితే, రెండు నెలల కిందట పిల్లలను తన భర్త రవిశంకర్ వద్ద వదిలి వెళ్లిందట తల్లి చంద్రిక.. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకుందామని భావించి ఉంటాడని.. తన పిల్లలను ఎవరు పోషిస్తారనే వారిని కూడా హత్య చేసి ఉంటాడని అంతా భావించారు.
Also Read:Pawan Kalyan: యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోడీ
ఇక, ఆ ఇంట్లో ఓ సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. “నా చావుకు ఎవరు బాధ్యులు కాదని, జీవితంలో ఏమి సాధించలేదని.. అందుకే నా పిల్లలను చంపి నేను చనిపోతున్నానని” లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు రవి శంకర్. తాజాగా కన్న బిడ్డలను హత్య చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిడ్డల్ని హత్య చేసి తాను సూసైడ్ చేసుకుంటున్నట్టు లేఖ రాసిన కనిపించకుండా పోయిన తండ్రి రవిశంకర్ ఆచూకీ పోలీసులు గుర్తించారు.
Also Read:Off The Record: కవిత ఫోన్ కూడా ట్యాపింగ్? అందుకే కామ్గా ఉన్నారా?
భార్య చంద్రికపై అనుమానంతో ఇద్దరు పిల్లల్ని ఈ నెల 8న హత్య చేసి రవిశంకర్ పరారయ్యాడు. కృష్ణానదిలో దూకి సూసైడ్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడాడు. ఇన్నిరోజులు కావస్తున్నా రవిశంకర్ బాడీ దొరక్క పోవటంతో బ్రతికి ఉన్నాడనే కోణంలో పోలీసులు విచారించారు. ఈ క్రమంలో విశాఖలో రవిశంకర్ ఉన్నట్టు గుర్తించి మైలవరం తీసుకు వచ్చారు పోలీసులు. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలని హత్య చేసినట్టు రవిశంకర్ ఒప్పుకున్నట్టు సమాచారం. రవిశంకర్ ను ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.