Kerala Woman Orders Biryani Online: కేరళలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక హోటల్ నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ వంటకం ‘కుజిమంతి’ని తిని ఓ మహిళ ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన అనుమానాస్పద కేసులో ప్రాణాలు కోల్పోయింది. కాసరగోడ్ సమీపంలోని పెరుంబాలకి చెందిన అంజు శ్రీపార్వతి డిసెంబర్ 31న కాసరగోడ్‌లోని రొమేనియా అనే రెస్టారెంట్‌లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ‘కుజిమంతి’ని తిని అనారోగ్యం పాలైంది. ఆమె వెంటనే ఆస్పత్రిలో చేరింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
“ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయబడింది. బాలిక శనివారం తెల్లవారుజామున మరణించింది” అని పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక అక్కడి నుంచి కర్ణాటకలోని మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ కమీషనర్‌కు ఆదేశాలు జారీ చేశామని, ఈ ఘటనపై, బాలికకు ఇచ్చిన చికిత్సపైనా డీఎంఓ కూడా పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్యే జార్జ్ పథనంతిట్టలో విలేకరులకు తెలిపారు.
Read Also: Russia-Ukraine War: మాట తప్పిన రష్యా.. కాల్పుల విరమణ ప్రకటనకు తూట్లు
ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన హోటళ్ల లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) కింద రద్దు చేస్తామని ఆమె తెలిపారు. ఈ వారం ప్రారంభంలో, కొట్టాయం మెడికల్ కాలేజీలో ఒక నర్సు కోజికోడ్‌లోని ఓ ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయి మరణించిందని అనుమానాలు వ్యక్తం అయ్యాయి.