విశ్వవిద్యాలయాలు అంటే చదువులకు నిలయం. ఎంతో మంది విద్యార్థులు ప్రయోజకులుగా తయారవుతుంటారు. అలాంటి చోట బాలీవుడ్ నటి సన్నీలియోన్ నృత్య ప్రదర్శన కోసం పర్మిషన్ కోరింది ఓ ఈవెంట్ సంస్థ. అప్రమత్తమైన కేరళ యూనివర్సిటీ అధికారులు.. సన్నీ లియోన్ డ్యాన్స్ ఈవెంట్‌కు అనుమతి నిరాకరించింది. కళాశాల క్యాంపస్‌ల్లో డీజే, పార్టీలు, మ్యూజిక్ నైట్ ప్రోగ్రామ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో కేరళ యూనివర్సిటీ క్యాంపస్‌లో సన్నీ లియోన్ డ్యాన్స్ ఈవెంట్‌కు వర్సిటీ రిజిస్ట్రార్ అనుమతి నిరాకరించారు.
జూలై 5న ప్రముఖ నటుడు స్టేజ్ షో తలపెట్టారు. ఈ కార్యక్రమం కేరళ రాజధాని తిరువనంతపురంలోని కార్యవట్టం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బాలీవుడ్ నటి సన్నీలియోన్ నృత్య ప్రదర్శనకు సిద్ధపడ్డారు. ఇందుకోసం పర్మిషన్ కోరారు. అయితే అందుకు కేరళ యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది.
కేరళ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్ ఈవెంట్‌ను నిషేధించారు. సన్నీ లియోన్ ప్రదర్శనను విశ్వవిద్యాలయంలో జరగకుండా చూసుకోవాలని రిజిస్ట్రార్‌ను వీసీ ఆదేశించారు. క్యాంపస్ లోపల లేదా వెలుపల ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. సన్నీ లియోన్ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం నుంచి ముందస్తు అనుమతి కోరడంతో ముందు జాగ్రత్తగా అడ్డుకున్నారు.
గత సంవత్సరం కొచ్చిన్‌లోని యూనివర్సిటీలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో కాలేజీ క్యాంపస్‌ల్లో ఎక్స్‌టర్నల్ డీజే పార్టీలు, మ్యూజిక్ నైట్‌లు మొదలైన వాటిపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మరణించగా.. కనీసం 64 మంది గాయపడ్డారు. క్యాంపస్‌లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో నిఖితా గాంధీ నేతృత్వంలోని సంగీత కచేరీ జరుగుతుండగా ఈ విషాద సంఘటన జరిగింది. ప్రోగ్రామ్ జరుగుతుండగా వర్షం పడింది. తలదాచుకోవడానికి ఆడిటోరియంలోకి పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాటకు దారితీసింది.
సన్నీలియోన్ ‘జిస్మ్ 2’, ‘జాక్‌పాట్’, ‘షూటౌట్ ఎట్ వడాలా’, ‘రాగిణి ఎంఎంఎస్ 2’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది . ఆమె ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టింది. ఏప్రిల్‌లో ఒక సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించింది.