Lottery Ticket: వారంతా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. పొట్ట కూటికోసం ఇంటింటికి తిరిగి చెత్త ఏరుకుంటూ వచ్చిన డబ్బులతో జీవిస్తుంటారు. ఉన్నట్లుంది వాళ్లను అదృష్ట దేవత కనికరించింది. వాళ్లకు లాటరీలో జాక్ పాట్ తగిలింది. దీంతో వారంతా కోటీశ్వరులైపోయారు. కేరళకు చెందిన 11 మంది మహిళలకు కోటి రూపాయల లాటరీ తగిలింది. ఈ విషయం తెలియగానే వారు ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలియగానే తాము నమ్మలేకపోయామని మహిళలు చెబుతున్నారు.
మలప్పురంలోని పరప్పనంగడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేనకు చెందిన 11 మంది మహిళలు కలిసి లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. వారం రోజుల క్రితం లాటరీ టికెట్ కొనేందుకు వెళ్లారు. కాగా టికెట్ ధర రూ.250. అంత డబ్బు వారి దగ్గరలేదు. దీంతో అందకి దగ్గర కలిపినా రూ.25 మాత్రమే వచ్చింది. దీంతో అప్పు అడగాలని నిర్ణయించుకున్నారు. ఎలాగోలా 250 రూపాయలు వసూలు చేసి టిక్కెట్టు కొన్నారు. ఇప్పుడు లక్కీ డ్రా ప్రకటించినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. లక్కీ డ్రా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వారిలోని ఓ మహిళ తెలిపింది.
Read Also:RRKPK: బాలీవుడ్ లిస్టులో మరో హిట్… మంచి రోజులు వస్తున్నాయి
పాలక్కాడ్‌కు చెందిన వ్యక్తి విజేతగా నిలిచాడని తెలియగానే తాను నిరుత్సాహానికి గురయ్యానని సమూహంలోని ఒక మహిళ చెప్పింది. మొదటి నంబర్ ఆమెదే టికెట్ అని తర్వాత తెలిసింది. అప్పుడు ఆనందానికి చోటు లేదు. ఈ 11 మంది మహిళల బృందాన్ని రూ.10 కోట్ల లాటరీ విజేతలుగా కేరళ టిక్కెట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఇంతకుముందు కూడా టిక్కెట్లపై పందెం కాసినట్లు రాధా అనే మహిళ చెప్పింది. ఇంత భారీ మొత్తం గెలవడం ఇదే తొలిసారి.
అప్పులు చేసి టిక్కెట్లు కొనుక్కున్న ఈ మహిళలు.. జీవితంలో ఇంత భారీ జాక్‌పాట్ వస్తుందని ఊహించలేదు. హరిత్ కర్మ సేన.. ఇంటి నుండి ఇతర ప్రాంతాల నుండి చెత్తను సేకరిస్తుంది. నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ కోసం పంపుతారు. ఈ మహిళలు చాలా కష్టపడి పనిచేస్తారని ఈ సంస్థ ప్రెసిడెంట్ షీజ చెప్పారు. కుటుంబ సభ్యుని చికిత్స, కుమార్తె వివాహం వంటి అనేక ముఖ్యమైన పనులు వారికి ఈ డబ్బులతో సులభంగా మారతాయి.
Read Also:Telangana Rains: రెండ్రోజుల పాటు వర్షసూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్