Uppu Kappurambu : కొన్ని సినిమాల్లో ఊహించని కాంబోలు సెట్ అవుతుంటాయి. అలాంటి ఓ కాంబినేషన్‌యే ఇది. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. కీర్తి సురేష్‌తో నటించబోతున్నాడు. వీళ్లిద్దరి కాంబోలో ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ తన ఓటీటీ కోసం రూపొందిస్తున్న ఒరిజినల్ మూవీ ఇది.
Read Also:Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..
అని. ఐ.వి. శశి దర్శకత్వంలో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి వసంత్ మురళీకృష్ణ మరింగంటి కథ అందించారు. ముంబై వేదికగా జరిగిన ప్రైమ్ ఈవెంట్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక ఉప్పు కప్పురంబు అనేది సెటైరికల్ కామెడీ జోనర్‌లో తెరకెక్కబోతుంది. ఇందులో కీర్తి సురేష్‌కి మంచి పెర్ఫామెన్స్ ఉన్న రోల్ ఆఫర్ చేశారట. అందుకే ఆమెఒప్పుకుందని సమాచారం.
Read Also:Israel–Hamas war: గాజాలో నిరాశ్రయులు బస చేస్తున్న స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికి పైగా మృతి
ఈ సినిమాపై సుహాస్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. దీనితో ఈ చిత్రాన్ని తాము పూర్తి చేసేసినట్టుగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరి ఇందులో కీర్తి సురేష్ తో కలిసి ఉన్న పిక్ ని పోస్ట్ చేయగా తమ సినిమా ఉప్పు కప్పురంబు షూటింగ్ నిన్న రాత్రితో పూర్తి చేసేసినట్టుగా తెలిపాడు. మరి కీర్తి సురేష్ తో అలాగే సినిమా యూనిట్ అందరితో కలిసి వర్క్ చేయడం ఎంతో బాగుంది అని తాను తెలిపాడు. దీనితో ఈ ఫోటోస్ ఇపుడు వైరల్ గా మారుతున్నాయి. తన నటనతో చిన్న చిన్న పాత్రలు నుంచి ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు సుహాస్.