Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తన తల్లి పేరుతో మొక్క నాటారు. దేశ ప్రజలు అమ్మ పేరుతో చెట్టు నాటాలనని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. దేశంలో పర్యావరణ మార్పుల వల్ల సమతుల్యం దెబ్బతిందన్నారు. దేశంలో అడవులు తగ్గిపోతున్నాయి, పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్నాయన్నారు. అమ్మకు మించింది లేదని, నవమాసాలు మోసి అమ్మ జన్మనిస్తుందన్నారు. దేశాన్ని భారత మాతతో పిలుస్తామన్నారు. భూమిని భూమాత అని పిలుస్తామన్నారు. బీఆర్ఎస్ విలీనం వార్తను పేపర్లలో చూశానని తెలిపారు.
Read also: BSNL Services: ప్రజలకు బిఎస్ఎన్ఎల్ సేవలు.. ఉద్యోగుల అవగాహన ర్యాలీ..
ఎటువంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. సుంకిశాల డామ్ కూలడం పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని తెలిపారు. బీఆర్ఎస్ విలీనం పై మా పార్టీలో ఎటువంటి సంప్రదింపులు లేవన్నారు. మీడియా పేపర్ కథనాన్ని చూసా అని తెలిపారు. అధ్యక్ష మార్పు పై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జమ్మూకాశ్మీర్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. పాక్ ఉగ్రవాదులు శాంతియుత పరిస్థితులు చెడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కు సిద్ధంగా ఉందన్నారు. జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.
Nagarjuna Sagar: సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు.. చూసేందుకు పర్యాటకుల సందడి..