Gold Price: గత కొన్ని రోజులనుంచి పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం కొనుగోలు చేద్దామన్న, ఇన్వెస్ట్ చేద్దామన్నా అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు అంతకంతకు ధరలు పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది బంగారం. కాగా, నేడు మరోసారి బంగారం ధరలు దూకుడును చూపించాయి. సోమవారం తులం బంగారంపై రూ. 550 పెరిగింది. దీనితో తగ్గేదేలే అంటూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Read Also: Piduguralla: పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం!
ఇక నేడు దేశ మార్కెట్లో గోల్డ్ ధర ఎంతుందోన్న విషయానికి వస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ. 500పెరిగి.. తులం గోల్డ్ ధర రూ. 79,400 వద్ద, అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 550 పెరిగి, దీంతో తులం పసిడి ధర రూ. 86,620 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 79550 వద్ద అమ్ముడవుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 86770 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు వెండి ధరలలో మాత్రం ఎటువంటి మార్పులు కనపడలేదు. నేడు కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో రూ. 1,08,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండి రూ. 1,00,500 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.