BRS Protests: కేసీఆర్ సిట్ విచారణ వేళ బీఆర్ఎస్ భారీ స్కెచ్!
- నేడు సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్
- సిట్ విచారణ వేళ బీఆర్ఎస్ భారీ స్కెచ్
- 5 వేల ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయడానికి సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో ఆ పార్టీ భారీ స్థాయిలో కార్యాచరణకు సిద్ధమైంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం పిలుపునిచ్చింది. గ్రామ, మండల, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్కో చోట ఒక్కో కార్యక్రమం ఉండేలా ప్లాన్ రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
అధినేత కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నివాసం నుంచి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరే ప్రతి మార్గాన్ని జనాలతో నింపాలనే వ్యూహాన్ని బీఆర్ఎస్ సిద్ధం చేసింది. కేసీఆర్ ప్రయాణించే మార్గాల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పాములపర్తి రాజీవ్ రహదారి టర్నింగ్, గౌరవరం, ములుగు, ఒంటిమామిడి, షామీర్పేట ప్రాంతాల్లో భారీ జన సమీకరణకు పార్టీ నేతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
- Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
Also Read: KCR-SIT: నేడు సిట్ విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్!
ఇదిలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఉదయం 8 గంటలకే తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్‌లోనే ఉండి పరిణామాలను పర్యవేక్షించనున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే హౌస్ అరెస్టులకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కినట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Astrology: మాట నిలబెట్టుకునే 4 రాశులవారు వీరేనా? ఒకసారి కమిట్ అయితే వెనక్కి తగ్గరట!
-
Trump warns Iran: హార్ముజ్ జలసంధి మూసేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
T20 World Cup : ఆస్ట్రేలియా కాదు, ఇంగ్లాండ్ కాదు.. ఇండియాని వణికిస్తున్న జట్టు ఇదే!
-
Vijay Birthday : రూ.70లక్షలు, 15 లారీలు.. విజయ్ జీవితాన్ని మలుపుతిప్పిన రోజు!
-
Vaibhav suryavanshi: 2026 “వైభవ్” నామ సంవత్సరం.. వామ్మో 7 నెలల్లో ఇన్ని రికార్డులా?
ట్రెండింగ్
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!