ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జూన్ 7 వరకు కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే లిక్కర్ కేసులో జూన్ 7న సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. మరోవైపు ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను జులై 3 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయగా.. కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఇది కూడా చదవండి: Stock Market: కొత్త ఊపు తెచ్చిన ఎగ్జిట్ పోల్స్.. ఆల్ టైమ్ లాభాల్లో సూచీలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రెండు సార్లు కవితను ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. ఇక పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసుకున్నా.. ఊరట లభించలేదు. బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురికావడంతో మూడు నెలలుగా కవిత తీహార్ జైల్లోనే ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: Viral News: ముక్కుతో టైప్ చేసి రికార్డు సృష్టించిన యువకుడు