ఇవాళ మూడవ కార్తీక సోమవారం. శైవాలయాలకు భక్తులు పోటెత్తారు.కార్తీకపౌర్ణమి 3వ సోమవారం కావడంతో శ్రీశైలంలో మల్లన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తులు , అనంతరం పూజలు చేస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు భక్తులు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికే అనుమతిస్తున్నారు అధికారులు. క్యూలైన్లో వేచి ఉన్నారు వేలాదిమంది భక్తులు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. శివనామస్మరణతో మారుమ్రోగుతోంది శ్రీశైల ముక్కంటి క్షేత్రం.
కార్తీక సోమవారం సందర్బంగా భక్తులతో కిటకిటలాడుతూన్న శ్రీకాళహస్తీ,కపీలతీర్దం సహా ఇతర శైవాలయాలు భక్తుల రద్దీతో కళకళలాడుతున్నాయి. బనగానపల్లె (మం) లోని యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు తరలివచ్చారు. కార్తీక మాసం మూడవ సోమవారం పర్వదినం సందర్భంగా అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్థ రాత్రి నుండి ప్రారంభమైన వ్రతాలు దర్శనాలు. వ్రత మండపాల క్యూలైన్లో బారులు తీరిన భక్తులు. స్వామి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
ఇటు తూర్పుగోదావరి జిల్లాలో కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి స్నానఘట్టాలు. కార్తీక సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. భక్తుల పుణ్య స్నానాలతో రాజమండ్రిలో కిక్కిరిసిన పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు పోటెత్తాయి. స్నానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు భక్తులు.
Read Also: Iran: హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నందుకు తొలి మరణశిక్ష విధించిన ఇరాన్
కార్తిక నోములు ఉన్న వారు కుటుంబ సమేతంగా విచ్చేసి గోదావరి నదిలో స్నానాలు ఆచరించి ఉపవాస దీక్ష చేస్తున్నారు. భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి స్నాన ఘట్టాలు. శివాలయాల్లో పరమేశ్వరుడి దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. భక్తుల రద్దీతో స్నాన ఘట్టాలు, శివాలయాలు వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఘాట్లను శుభ్రపరుస్తున్నారు మున్సిపల్ కార్పోరేషన్ శానిటరీ సిబ్బంది .
శ్రీకాకుళం జిల్లా కార్తిక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలకు పోటెత్తారు భక్త జనం. శ్రీముఖలింగం , ఉమారుద్రకోటిశ్వరాలయం, శ్రీ ఎండల మల్లిఖార్జున దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచరామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో ఆలయం వద్ద బారులు తీరారు భక్తులు.స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీకమాసం మూడో సోమవారం కావడంతో పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఇదిలా ఉంటే.. విశాఖపట్నంలో నేడు టీటీడీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో కార్తీక మహా దీపోత్సవం….శోభాయాత్ర, దీపోత్సవంలో మూడు వేల మంది భక్తులు పాల్గొనే అవకాశం వుందని భావిస్తున్నారు.
Read Also: Children’s Day: జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం.. ఆయన్ని పిల్లలు చాచా అని ఎందుకు పిలుస్తారు?