తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజలను ఆకర్షించేందుకు ఆయా పార్టీల నేతు వరాల జల్లులు కురిపిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్‌కు మద్దతుగా కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ నేడు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారని, గత చివరి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే లను కొనుగోలు చేసి కూల్చేసింది బీజేపీనేని ఆయన మండిపడ్డారు. డబులింజన్ సర్కార్ నినాదం తోవచ్చిన బీజేపీ ని కర్ణాటక లో ప్రజలు ఓడించారన్నారు బీకే హరిప్రసాద్. తెలంగాణలో ట్రిపులింజన్ పేరుతో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లు కలిసి పనిచేస్తున్నా కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా వున్నారన్నారు బీకే హరిప్రసాద్. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన కూతురు ను జైలు కు వెళ్లకుండా కాపాడుకుంటున్నాడని ఆయన ఆరోపించారు.
Also Read : Kerala: ప్రభుత్వ కార్యాలయంలో ప్రార్థనలు.. ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు
అంతేకాకుండా.. ‘తెలంగాణ లో బీసీ లకు 23%రిజర్వేషన్ లు మాత్రమే ఉన్నాయి… కులగనణ చేసి రిజర్వేషన్ లు పెంచుతాం… రాహుల్ గాంధీ బీసీ ల రిజర్వేషన్ ల కోసం డిమాండ్ చేశారు… జీ ఎస్టీ వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు టాక్స్ కడుతున్నారు… తెలంగాణ ఇచ్చి ప్రజల కల నెరవేర్చింది కాంగ్రెస్… తెలంగాణ లిక్కర్ పాలసీ నుండి వచ్చిన డబ్బులతోనే బీ ఆర్ ఎస్ ఎన్నికలకు వెళ్ళింది… కర్ణాటక రైతులకు సరిపడేలా 10గంటల కరెంట్ ఇస్తుంది… కేసీ ఆర్ అబద్దాలు మాట్లాడుతుండు.. కుమారస్వామీ తో మాట్లాడించేవారు బిజెపి, బీ ఆర్ ఎస్ లే… బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల మిస్సింగ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి… బీసీ లు ఎక్కువగా ఉన్నా ఫైనాన్స్ పరంగా చాలా వీక్ గా వున్నారు… బీసీ ల సంక్షేమం, ప్రజా ప్రభుత్వమే కాంగ్రెస్ లక్ష్యం…’ అని బీకే హరిప్రసాద్ వ్యాఖ్యానించారు.
United Nations: గాజా పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తక్షణమే ఆపాలి.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్