Inspirational Story: 75 ఏళ్ల వృద్ధుడి మహా అంటే ఏం చేస్తాడు.. కృష్ణారామా అనుకుంటూ శేష జీవితాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలని కోరుకుంటాడు. అలాంటి వారికి విభిన్నంగా నిలిచారు ఒకరు. ఆయన తన జీవితాన్ని కండక్టర్‌గా ప్రారంభించారు. తనకు కన్నడ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేయలానే ఆకాంక్షతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, చక్కెర ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. అందులో మూడు దశాబ్దాలు పని చేస్తే వచ్చిన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని పుస్తకాలు కొనడానికే కేటాయించేవాడు. ఇప్పుడు ఆయనకు 75 ఏళ్లు. తన వ్యక్తిగత లైబ్రరీలో ఇప్పుడు 20 లక్షల పుస్తకాలు ఉన్నాయి. నిజంగా ఇది ఒక సామాన్యుడికి సాధ్యమవుతుందా.. కానీ అంకె గౌడ నిజం చేశాడు. వండర్ సృష్టించాడు. ఇంతకీ ఆయన కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Dharmasthala: ధర్మస్థలపై తప్పుడు ప్రచారం, డబ్బులు తీసుకుని యూట్యూబర్ల కథనాలు
హరలహళ్లి అనే చిన్న గ్రామం..
కర్ణాటకలోని పాండవపుర సమీపంలోని హరలహళ్లి అనే చిన్న గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు అంకె గౌడ. గౌడ 20 సంవత్సరాల వయసులో బస్సు కండక్టర్గా పనిచేస్తూ పుస్తకాలను సేకరించడం ప్రారంభించాడు. తరువాత కన్నడ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి ఆ ఉద్యోగాన్ని వదిలివేసి, చక్కెర కర్మాగారంలో దాదాపు మూడు దశాబ్దాలు పనిచేశాడు. అతని సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాలు కొనడానికే పోయింది. తన పుస్తక సేకరణను మరింత విస్తరించడానికి, ఆయన మైసూరులో తన ఉన్న ఆస్తిని కూడా అమ్మేశాడు. ఈ విషయంలో ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు సాగర్ గౌడకు మద్దతుగా నిలిచారు.
ఆయన తన భార్య కొడుకు సాయంతో దాదాపు రెండు మిలియన్ల పుస్తకాలతో కూడిన వ్యక్తిగత లైబ్రరీ ఏర్పాటు చేయగలిగాడు. ఇప్పుడు ఈ లైబ్రరీ ఎంతో మంది పరిశోధకులు, విద్యార్థులు, రచయితలకు ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “పరిశోధకులు, విద్యార్థులు ప్రధానంగా నా దగ్గరకు వస్తారు. సివిల్ సర్వీస్ ఆశావహులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ లైబ్రరీకి వచ్చారు. నా లైబ్రరీలో సభ్యత్వ రుసుము లేదా ప్రవేశ రుసుము లేదు. ఎవరైనా వచ్చి చదవవచ్చు, జ్ఞానాన్ని పొందవచ్చు” అని అన్నారు. ఆయన వద్ద దాదాపు 5 లక్షల అరుదైన విదేశీ పుస్తకాలు ఉన్నాయి. వాటితో పాటు వివిధ భాషలలో దాదాపు 5 వేల నిఘంటువులు ఉన్నాయి. ఇందంతా కేవలం తనకు సాహిత్యం మీద ఉన్న ఇష్టంతో చేసిందే అని అంకె గౌడ పేర్కొన్నారు.
READ ALSO: LIC recruitment 2025: ఎల్ఐసీలో జాబ్ నోటిఫికేషన్.. లక్షల్లో జీతాలు