Karnataka High Court: ట్విట్టర్‌కు కర్ణాటక హైకోర్టు షాక్.. రూ.50 లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సంస్థకు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 మధ్య కేంద్ర ప్రభుత్వం పదిసార్లు ట్విట్టర్‌ను బ్లాక్ చేయాలని ఆదేశించినట్లు ట్విట్టర్ తన పిటిషన్‌లో పేర్కొంది. మరో 39 యూఆర్ఎల్స్‌ను కూడా తీసివేయాలని కేంద్ర ఐటీశాఖ ఆదేశించింది. కొన్ని ఖాతాలను నిలిపివేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం కొట్టివేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా సోషల్ మీడియా సంస్థ కోర్టును ఆశ్రయించిందని న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ అన్నారు.
Also Read
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ఇందుకు ట్విట్టర్‌పై రూ. 50 లక్షలు విధించారు. 45 రోజుల్లోగా కర్ణాటక లీగల్ సెల్ సర్వీసెస్‌కు ఈ మొత్తం చెల్లించాలని కోర్టు ట్విట్టర్‌ను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విట్టర్ సంస్థ ఇవ్వలేదని న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ తెలిపారు. ట్విట్టర్ సంస్థ ఓ రైతు కాదు, ఓ సాధారణ వ్యక్తి కాదు అని, దానికి చట్టం తెలియదన్న విషయం కాదు అని, అదో బిలియనీర్ కంపెనీ అని కోర్టు పేర్కొంది. తీర్పులో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కోర్టు సమర్థించింది. ట్వీట్లను, అకౌంట్లను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు జస్టిస్ కృష్ణ దీక్షిత్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 ప్రకారం భారత పౌరులకు లభించే భావప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను ఓ విదేశీ కంపెనీ అయిన ట్విట్టర్ క్లెయిమ్ చేయలేదని కోర్టు సూచించింది.
తాజావార్తలు
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!