Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హస్తం పార్టీ గెలుస్తుంది అనుకున్నారు కానీ ఇంత మెజార్టీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. బీజేపీ ఎన్ని వ్యూహాలు పన్నినా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. కాంగ్రెస్ ధాటికి బీజేపీ మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఏకంగా 136 సీట్లు గెల్చుకుంది. మరోసారి అధికారం చేజిక్కించుకుంటామని భావించిన బీజేపీ కేవలం 64 స్థానాలకు పరిమితమైంది. కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతామని ప్రకటనలు చేసిన జేడీఎస్ 20 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కేబినెట్ మంత్రులు సైతం కాంగ్రెస్ దెబ్బకు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Read Also:Karnataka Results: కర్ణాటకలో సెంటిమెంట్ రిపీట్.. ఏ పార్టీ రెండో సారి గెలవలేదు
ఈ ఎన్నికల్లో తాజా మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై సహా 12 మంది మంత్రులు విజయం సాధిస్తే 11 మంది మంత్రులు మాత్రం ఓడిపోయారు. హిజాబ్ ఆందోళనను పెంచి పోషించడమే కాకుండా విద్వేషపూరిత వ్యాఖ్యలతో సంచలనం రేపిన మరో మంత్రి బీసీ నగేష్ సైతం ఓడిపోయారు. ఓడిపోయిన మంత్రుల్లో రాజరాజేశ్వరి నగర్ నుంచి మునిరత్న, ఎల్లాపూర్ నుంచి శివరామ్ హెబ్బార్, వరుణ నుంచి వి సోమన్న, బళ్లారి నుంచి బీఎస్ శ్రీరాములు, చిక్కనాయకపల్లి నుంచి మధుస్వామి, ముథోల్ నుంచి గోవింద కరజోల్, చిక్ బళ్లాపూర్ నుంచి కే సుధాకర్, హోస్కోట్ నుంచి ఎంటీబీ నాగరాజ్, హీరేకెరూర్ నుంచి బీసీ పాటిల్, బీళగి నుంచి మురుగేష్ నిరాణి తో పాటు బీసీ నగేశ్, శంకర్ పాటిల్ తదితరులు ఓటమిపాలయ్యారు.
Read Also:PBKS vs DC: పంజాబ్ కింగ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారో తెలుసుకుందాం
1) వి. సోమన్న – గృహ నిర్మాణ & మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి – 46,253 ఓట్లతో ఓటమి
2) శంకర్ పాటిల్ మునినాకొప్ప – చేనేత, జౌళి శాఖల మంత్రి – 22,199 ఓట్లతో ఓటమి
3) బీ. శ్రీరాములు – రవాణా శాఖ మంత్రి – 29,300 ఓట్లతో ఓటమి
4) గోవింద్ కర్జోల్ – ఇరిగేషన్ శాఖ మంత్రి – 17,335 ఓట్లతో ఓటమి
5) జె. సి. మధుస్వామి – న్యాయ శాఖ మంత్రి – 10,042 ఓట్లతో ఓటమి
6) మురుగేష్ నిరాని – భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖల మంత్రి – 11,129 ఓట్లతో ఓటమి
7) కేశవరెడ్డి సుధాకర్ – ఆరోగ్యశాఖ మంత్రి – 10,642 ఓట్లతో ఓటమి
8) బసవన్నగౌడ చెన్నబసవన్నగౌడ పాటిల్ – వ్యవసాయశాఖ మంత్రి – 15,020 ఓట్లతో ఓటమి
9) ఎం.టి.బి. నాగరాజ్ – పరిశ్రమల శాఖ మంత్రి – 5,075 ఓట్లతో ఓటమి
10) నారాయణ గౌడ – క్రీడల శాఖ మంత్రి – 20,151 ఓట్లతో ఓటమి
11) బి. సి. నగేష్ – సెకండరీ విద్య శాఖల మంత్రి – 17,652 ఓట్లతో ఓటమి