DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్‌పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- కర్ణాటకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం
- ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణం
- 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం
- మహిళలకు చోటు లేకపోవడంపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో బుధవారం డీకే.శివకుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. డీకే.శివకుమార్ ముఖ్యమంత్రిగా.. ఆయనతో పాటు 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. డీకే.శివకుమార్ అయితే ముఖ్యమంత్రి అయ్యారు గానీ.. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కకపోవడంపై ప్రస్తుతం రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుల సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్‌ను రూపొందించినప్పటికీ.. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక కేబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం.. దేశంలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యంపై మరోసారి చర్చకు దారితీసింది. శాసనసభల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అధికార కేంద్రాల్లో వారికి తగిన స్థానం దక్కడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి?
ఇటీవల ఏర్పడిన పలు రాష్ట్ర ప్రభుత్వాల్లో మహిళలకు కనీసం కొంత మేర ప్రాతినిధ్యం కల్పించారు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వంలో 35 మంది మంత్రుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఇక తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో 23 మంది మంత్రుల్లో నలుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు. కేరళలో ముఖ్యమంత్రి సతీశన్ కేబినెట్లో 20 మంది మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అసోంలో ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు మంత్రుల్లో ఒకరు మహిళ ఉన్నారు. కర్ణాటకలో 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తే ఒక్క మహిళ కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్‌కాట్..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
కర్ణాటకలో 224 మంది సభ్యుల్లో అసెంబ్లీలో కేవలం 10 మంది మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కొత్త కేబినెట్లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో లింగ సమానత్వంపై మరోసారి చర్చ మొదలైంది. రాజకీయ పార్టీల నిర్ణయాత్మక స్థానాల్లో మహిళలకు మరింత అవకాశాలు కల్పించాలని మహిళా సంఘాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్‌పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్‌కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!