Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- కేరళలో వివాదంగా ఇస్లామిక్ ఫ్రెండ్లీ జిమ్..
- వ్యాయామానికి మతం రంగు అంటూ విమర్శలు..
- విమర్శల నేపథ్యంలో ఓనర్ నవాజ్ క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’, కేరళలో వివాదాస్పదంగా మారింది. పాలక్కాడ్‌కు చెందిన నవాజ్ ముత్తు టి ఈ పేరుతో ఒక జిమ్ ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేయడం వైరల్‌గా మారింది. అయితే, చాలా మంది దీనిని మతపరమైన కోణం ఉందని విమర్శిస్తున్నారు. అయితే, వివాదం పెద్దది కావడంతో ఓనర్ నవాజ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన జిమ్‌లో పెద్ద శబ్ధంతో మ్యూజిక్ ఉండదని, పురుషులు, ఆడవాళ్లకు వేర్వేరు సమయాలు, వేర్వేరు ప్రదేశాలు ఉంటాయని చెప్పారు. ట్రైనర్లు కూడా వేరుగా ఉంటారని వెల్లడించారు.
క్లారిటీ ఇచ్చిన నవాజ్:
నవాజ్ మాట్లాడుతూ.. ‘‘తాము ఇస్లాంకు అనుగుణంగా ఒక జిమ్ ప్రారంభిస్తున్నామని, కేరళలో ఇదే మొదటిది అవుతుందని, ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించాలి’’ అని ప్రచారం ప్రారంభించాడు. పేరుపై చాలా మంది విమర్శలు చేస్తున్న తరుణంలో, తన జిమ్ కొత్తది కాదని 15 ఏళ్లుగా నడుస్తున్న ఫిట్నెస్ సెంటర్ అని, ప్రస్తుతం దాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు.
Also Read
ఇస్లామిక్-ఫ్రెండ్లీపై విమర్శలు:
అయితే, సోషల్ మీడియాలో దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించే ప్రయత్నంగా కొందరు చెబుతుండగా, మరికొందరు జిమ్‌లో మహిళల కోసం ప్రత్యేక ట్రైనర్లు, సమయాలు ఉండటం సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు. కొంత మంది దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తు్న్నారు. మతపరమైన గుర్తింపుతో జిమ్‌లను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్వించారు. ఫిట్ నెస్‌కు మతంతో ముడిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. దీని వల్ల సమాజంలో విభజన ఏర్పడుతుందని అన్నారు.
విమర్శలు ఎక్కువ కావడంతో నవాజ్ తన జిమ్ అన్ని మతాల వారికి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఇది కేవలం ముస్లిం కోసం మాత్రమే కాదని చెప్పారు. తాను ఇది ముస్లింల జిమ్ అని లేదా ముస్లిం కోసం మాత్రమే అని చెప్పడం లేదని తెలిపారు. ఇస్లామిక్ ఫ్రెండ్లీ అనేది కొన్ని పద్ధతుల్ని సూచిస్తుందని, అంతే కానీ వేరే మతాల వారు రావడంపై ఆంక్షలు ఉండవని చెప్పారు. స్త్రీలు, పురుషులు కలిసి వ్యాయామం చేయకుండా ప్రత్యేక ప్రాంతాలు ఉండాలని, సమయాలు వేరుగా ఉండాలని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు