Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టీ20 జట్టుకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడే అతిగా అంచనాలు పెంచుకుని ఒత్తిడి తీసుకురావద్దని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిమానులకు, నిపుణులకు విజ్ఞప్తి చేశారు. ఒత్తిడి అధిగమించకపోతే డకౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయని.. దయచేసి అతడిపై ఒత్తిడిని తీసుకురావద్దని కోరాడు.
సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడుతూ.. భారత సీనియర్ పురుషుల జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డుకెక్కాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఈ ఏడాది జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల జట్టులోనూ అతనికి చోటు దక్కింది.
Also Read
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
- Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
క్లబ్ క్రికెట్‌కు, దేశానికి ఆడటానికి తేడా ఉంది..
1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. వైభవ్‌ను ఒక ‘అద్భుతమైన ప్రతిభావంతుడి’గా అభివర్ణించారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడటానికి అతనికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. అతను అసాధారణమైన ఆటగాడు అనడంలో సందేహం లేదు. కానీ జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, మానసికంగా దృష్టి కేంద్రీకరించడం వంటి ఎన్నో విషయాలు ఉంటాయి. క్లబ్ క్రికెట్‌కు, దేశం తరఫున ఆడటానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అతనికి తగినంత సమయం ఇవ్వండి, ఇప్పుడే పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకోవద్దు అని కపిల్ హితవు పలికారు.
అంతర్జాతీయ వేదికపై రాణిస్తాడు: మదన్ లాల్ ధీమా
మరోవైపు కపిల్ దేవ్ మాజీ సహచరుడు, మాజీ పేసర్ మదన్ లాల్ మాత్రం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఐపీఎల్లో ప్యాట్ కమిన్స్, కగిసో రబాడ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని వైభవ్ పరుగుల వరద పారించిన తీరును ఆయన గుర్తుచేశారు. 15 ఏళ్ల వయసులోనే స్థిరమైన ప్రదర్శనతో జట్టులో చోటు దక్కించుకోవడం విశేషమని, అతని దూకుడు గేమ్ ప్లాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు సరిగ్గా సరిపోతుందని మదన్ లాల్ ధీమా వ్యక్తం చేశారు.
ఆసియా క్రీడల్లో గోల్ఫ్ జట్టుపై కపిల్ ఆశలు
క్రికెట్ ముచ్చట్ల అనంతరం… ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (PGTI) అధ్యక్షుడిగా ఉన్న కపిల్ దేవ్, త్వరలో జరగబోయే ఆసియా క్రీడల్లో భారత గోల్ఫ్ జట్టు ప్రదర్శనపై స్పందించారు. గత హ్యాంగ్జౌ ఆసియా క్రీడల్లో అదితి అశోక్ సాధించిన రజత పతకం దేశంలో గోల్ఫ్ పట్ల అవగాహనను పెంచిందని, అది తర్వాతి తరానికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. పతకాలు గెలవడంతో పాటు ఆటగాళ్లు చూపించే పోటీతత్వం, వారి ప్రవర్తన కూడా అంతే ముఖ్యమని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!