Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలో ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముస్లిం లీగ్ ఎమ్మెల్యే ఫాతిమా తాలియా సంప్రదాయ ‘‘దీపం’’ వెలిగించడం వివాదంగా మారింది. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్(ఐయూఎంఎల్) తొలి మహిళా ఎమ్మెల్యే ఫాతిమా ఇప్పుడు మత పెద్దల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. సున్నీ మత సంస్థ ‘‘సమస్త’’ దీపం వెలిగించడంపై అభ్యంతరం తెలిపింది. తన నియోజకవర్గమైన పెరంబరలో జరిగిన ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫాతిమా దీపం వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ముస్లిం మతపెద్దల్లో దీనిపై చర్చ ప్రారంభమైంది.
ఇస్లాం బోధనలపై ఆధారపడని, ఇతర మతాల ఆచారాలుగా పరిగణించబడే చర్యలకు ముస్లింలు దూరంగా ఉండాలని సమస్తా పేర్కొంది. ఇతర మతాలు వారు, వారి మతంలో దీపం వెలిగించే సంప్రదాయాన్ని పాటిస్తారని పేర్కొంది. ఒక వేళ ముస్లిం అలాంటి మత చిహ్నాలకు లేదా ఆచారాలు పాటిస్తే, అది మత ఉల్లంఘనలకు దారి తీస్తుందని ఆ సంస్థ చెప్పింది. అయితే, దీపాన్ని కేవలం వెలుగు కోసం మాత్రమే వెలిగించడం, దానికి ఏ మతపరమైన ఆచారాలు, భావోద్వేగాలతో సంబంధం లేకపోతే దానిని భిన్నంగా చూడవచ్చని పేర్కొంది.
Also Read
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
తాజావార్తలు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!