సంక్రాంతికి విడుదల కాబోతున్. రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల టికెట్ ధరలు, అదనపు షోస్ ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించైనా సంగతి తెలిసిందే. టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాలకు సాధారణ ధరలతో వసూళ్లు రాబట్టడం కష్టమని సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ హై కోర్టులో అప్పీల్ చేసారు ఇరు చిత్రాల నిర్మాతలు.
Also Read : I – Bomma : ఐబొమ్మ రవికి మరొక షాక్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్
ఈ పిటిషన్ పై విచారణలు జరిపిన హైకోర్టు రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు ఊరటనిచ్చింది. టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన హైకోర్టు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పుష్ప-2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ-2 చిత్రాలకే పరిమితం చేసింది హైకోర్టు. దాంతో రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల ప్రీమియర్ షోస్, అదనపు టికెట్ ధరలు పెంచుకుకునేందుకు కు లైన్ క్లియర్ అయింది.