Kane Williamson and Tim Southee Played 100 Test Match: సీనియర్స్ ప్లేయర్స్ కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు ఇప్పటికీ న్యూజిలాండ్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విలియమ్సన్ పరుగుల వరద పాటిస్తుంటే.. సౌథీ వికెట్స్ పడగొడుతున్నాడు. అండర్19 ప్రపంచకప్ కలిసి ఆడిన ఈ ఇద్దరు.. అంతర్జాతీయ 100 టెస్ట్ మ్యాచ్ కూడా కలిసే ఆడారు. క్రైస్ట్‌చర్చ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ విలియమ్సన్, సౌథీలకు కెరీర్‌కి 100వ టెస్ట్ మ్యాచ్. 100 టెస్ట్ మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న 5, 6వ న్యూజిలాండ్ ఆటగాళ్లుగా వీరు నిలిచారు.
కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు 2008లో జరిగిన ఐసీసీ పురుషుల అండర్19 ప్రపంచకప్‌లో ఆడారు. అండర్19 ప్రపంచకప్‌కు కొన్ని వారాల ముందు టీ20 ఫార్మాట్‌లో సౌథీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సంవత్సరం లోపే టెస్ట్ అరంగేట్రం కూడా చేశాడు. అయితే విలియమ్సన్ తన టెస్ట్ అరంగేట్రం చేయడానికి రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఇద్దరు మూడు ఫార్మాట్‌లలో వేగంగా ఎదిగారు. న్యూజిలాండ్ జట్టుకు కీలక ఆటగాళ్లుగా మారిపోయారు.
Also Read: IND vs ENG: సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా ఇంగ్లండ్ కోచ్‌లు.. కారణం ఏంటంటే?
కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీల ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2011, 2015, 2019 మరియు 2023 వన్డే ప్రపంచకప్‌లు ఇద్దరు కలిసి ఆడారు. అంతేకాదు టీ20 ప్రపంచకప్‌లు కూడా ఆడారు. టీ20 ప్రపంచకప్ 2024 ఆడడానికి కూడా సిద్ధమయ్యారు. విలియమ్సన్ టెస్టుల్లో 8675 పరుగులు చేశాడు. ప్రస్తుత ఆటగాళ్లలో విలియమ్సన్ కంటే ఎక్కువ టెస్టు సెంచరీలు (32) ఎవరూ చేయలేదు. మరోవైపు సౌథీ 378 టెస్ట్ వికెట్స్ పడగొట్టాడు.
– Played the 2008 U19 World Cup together.
– Played the 2011, 2015, 2019 and 2023 World Cup together.
– Playing the 100th Test together.Kane Williamson 🤝 Tum Southee.pic.twitter.com/xfqsJjAB9h
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 8, 2024