Paul Collingwood and Marcus Trescothick been listed as Substitute Fielders: ధర్మశాల వేదికగా శుక్రవారం భారత్‌తో ఆరంభమైన ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ టీమ్ తమ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా కోచ్‌ల పేర్లను ప్రకటించింది. కోచింగ్ స్టాఫ్ అయిన పాల్ కాలింగ్‌వుడ్, మార్కస్ ట్రెస్కోథిక్‌ల పేర్లను సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ల జాబితాలో ఇంగ్లండ్ చేర్చింది. దాంతో ఈ ఇద్దరూ కోచ్‌లు బ్రేక్ సమయాల్లో డ్రింక్స్ తీసుకుని మైదానంలోకి వచ్చారు. ఇందుకుసంబందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుటున్నాయి. కోచ్‌లు అయిన కాలింగ్‌వుడ్, ట్రెస్కోథిక్‌లు డ్రింక్స్ మోయడానికి కారణం ఏంటంటే.
ఐసీసీ నిబంధన ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రతి జట్టు గరిష్టంగా ఆరుగురు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ల పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ ప్లేయర్స్ అందరూ అందుబాటులో లేరు. ఓలీ రాబిన్సన్ లూజ్ మోషన్స్‌తో ఇబ్బందిపడుతుండగా.. మరికొందరు ఆటగాళ్లకు గాయాలు అయ్యాయి. ఇంకొందరు ప్లేయర్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశం వెళ్లిపోయారు. దాంతో ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు 14 మందే అందుబాటులో ఉన్నారు. దాంతో ఇంగ్లండ్ తమ కోచింగ్ స్టాఫ్‌ను సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా పేర్కొంది.
Also Read: Raadhika Sarathkumar: విరుదునగర్ స్థానం నుంచి సినీనటి రాధికా శరత్‌కుమార్ పోటీ?
ఆటగాళ్లు గాయపడినప్పుడు లేదా అస్వస్థత గురైనప్పుడు సపోర్ట్ స్టాఫ్ సబ్‌స్టిట్యూట్‌లుగా బరిలోకి దిగుతుంటారు. ఇలా గతంలో చాలా సార్లు జరిగింది. కోచ్‌లు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా ఆడారు. కొన్ని సందర్భాల్లో ఫీల్డింగ్ కూడా చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ (5/72), ఆర్ అశ్విన్ (4/51) ధాటికి 218 పరుగులకే కుప్పకూలింది. జాక్ క్రాలీ (79; 108 బంతుల్లో 11×4, 1×6) పోరాడాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 30 ఓవర్లలో 135/1తో మొదటి రోజు ఆట ముగించింది. యశస్వి జైస్వాల్ (57; 58 బంతుల్లో 5×4, 3×6) హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ (52; 83 బంతుల్లో 6×4, 2×6)తో పాటు శుభ్‌మన్ గిల్ (26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.