Site icon NTV Telugu

Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్‌లో బిగ్ ట్విస్ట్..

Kaleshwaram Commission

Kaleshwaram Commission

కాళేశ్వరం కమిషన్‌లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31తో కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగియనుంది. బహిరంగ విచారణను ముగించినట్లు కమిషన్ వర్గాలు ప్రకటించాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయ నాయకుల విచారణ లేకుండానే నివేదిక ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమైంది. పీసీ ఘోష్ కమిషన్ పదవీ కాలం పెంపుతో మళ్ళీ విచారణ కొనసాగించే అవకాశం ఉంది. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను విచారించేందుకే కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం పొడిగించారంటున్న ఇరిగేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

READ MORE: Manchu Manoj: నాకు మా మెంబర్ షిప్ ఇవ్వలేదు.. మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్‌ గడువును ఈ నెల 31 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కమిషన్‌ను నియమించగా, 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్‌ గడువును పొడిగిస్తూ వచ్చింది. తాజాగా మరోసారి జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

READ MORE: CM Revanth Reddy: రాష్ట్రంలోని ఆ ఐదారుగురు సన్నాసుల గురించి పట్టించుకోను..

మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిందని చెబుతున్నారు. బహిరంగ విచారణకు పొలిటికల్‌ లీడర్లను విచారణకు పిలువొద్దని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు ఊరట లభించినట్లైంది. లీగల్ సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతో వారిని విచారణకు పిలవకూడదని నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్‌ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది. దాదాపు 4వందల పేజీల రిపోర్ట్‌ను కమిషన్‌ తయారు చేసింది. ఈనెల 20 తర్వాత రిపోర్టు ఇవ్వనున్నట్లు తెలిసింది. కాగా.. అంతలోనే మరోసారి గడువు పొడిగించారు.

Exit mobile version