Kaleshwaram Commission Report: ఒకట్రెండు రోజుల్లో కాళేశ్వరం కమీషన్ నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వంకు ఇవ్వనుంది. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచారు. దాదాపు 500 పేజీలతో తుది నివేదికను కమిషన్ ఇవ్వనుంది. 3 వేల పేజీలతో మొత్తం డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు ఒకటి లేదా రెండో తేదీన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నివేదికను స్వీకరించి.. ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల…
KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలపై తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఈ రోజు (జూన్ 11న) నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్కు వెళ్లనున్నారు.
Breaking News : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు , ఈటల రాజేందర్‌లకు జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈ కమిషన్, 15 రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని ముగ్గురు నేతలను ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు…
కాళేశ్వరం కమిషన్‌లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31తో కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగియనుంది. బహిరంగ విచారణను ముగించినట్లు కమిషన్ వర్గాలు ప్రకటించాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయ నాయకుల విచారణ లేకుండానే నివేదిక ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమైంది. పీసీ ఘోష్ కమిషన్ పదవీ కాలం పెంపుతో…