మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు, సినీ హీరో మంచు మనోజ్, MAA (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) మెంబర్‌షిప్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే, ఆయన ప్రధాన పాత్రలో ‘భైరవం’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌లతో కలిసి మంచు మనోజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. రేపు మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన మీడియాతో ముచ్చటించాడు.
Also Read:Vijay Sethupathi: ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా..
ఈ సందర్భంగా తొమ్మిదేళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది ప్రశ్నించగా, అంతకుముందు బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేసిన ఆయనకు ఈ తొమ్మిదేళ్ల గ్యాప్ రావడానికి ‘శివయ్య ఆజ్ఞ’ ఏమైనా ఉందా, ఏమైంది అని అడిగారు. దీనికి మంచు మనోజ్ ముందుగా నవ్వాడు. ఎందుకంటే, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ప్రస్తుతం కొంత గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమాలోని ‘శివయ్య’ అనే డైలాగ్‌ను నిన్న రాత్రి జరిగిన ‘భైరవం’ ఈవెంట్‌లో మనోజ్ ప్రస్తావించాడు.
Also Read:Samantha : సమంత, రాజ్ పై శ్యామలి మరో పోస్ట్ ..!
‘శివయ్యను శివయ్య అని పిలిస్తే రాడు, ఆయన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల రూపంలో వస్తాడు’ అంటూ కామెంట్ చేశాడు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధి ప్రస్తావించగా, ‘నాకు MAAలో మెంబర్‌షిప్ ఇవ్వలేదు’ అంటూ నవ్వేశాడు మంచు మనోజ్. అన్నట్టు మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, నిజానికి తాను గ్యాప్ తీసుకోవాలని ముందే అనుకున్నానని, అప్పట్లో ఇదే విషయాన్ని ఒక ట్వీట్ చేసి, తర్వాత డిలీట్ కూడా చేశానని చెప్పుకొచ్చాడు.