Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.స్టార్ హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజి లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత ఓ బాబుకి తల్లి అయి ఫ్యామిలీ లైఫ్ ఎంతో హ్యాపీగా గడుపుతుంది.చాన్నాళ్లకు కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.కాజల్ అగర్వాల్ ప్రస్తుతం నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’. మే 31న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ మరియు సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి.కాజల్ ప్రస్తుతం “సత్యభామ” సినిమా ప్రమోషన్ లో బిజీ గా వుంది.ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ ఇటీవల అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొనింది.ఆ షో లో కాజల్ పలు ఆసక్తికర విషయాలు తెలియజేసింది.ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కాజల్ ఆసక్తికర విషయం తెలిపింది.. అల్లు అర్జున్ షూటింగ్ సమయంలో మంచి సలహా ఇచ్చాడు. . కెమెరా ఆఫ్ చేశాక కూడా కొంచెం సేపు అదే ఎమోషన్ లో ఉండాలని అది ఎడిటింగ్ సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అల్లుఅర్జున్ తెలిపినట్లు ఆమె తెలిపింది.నేను ఇప్పటికి కూడా దాన్ని పాటిస్తున్నాను అని కాజల్ తెలిపింది.