Rakesh Master: టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరంలో ఈవెంట్ చూసుకొని ఇంటికి చేరుకోగానే.. ఆయనకు సన్ స్ట్రోక్ తగిలి.. రక్త విరోచనాలు అవుతుండడంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక రాకేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే.. ఆయన అసలు పేరు ఎస్. రామారావు. 1968 సంవత్సరంలో తిరుపతి ప్రాంతంలో జన్మించాడు. ఈయనకు నలుగురు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం అసిస్టెంట్ గా పనిచేశాడు. అనంతరం ఆట డ్యాన్స్ షోలో డ్యాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Comedian Sudhakar: చిరంజీవితో గొడవలు.. కాంట్రవర్సీ చేయకండి
వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. అంతేకాకుండా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వారికి శిక్షణ చిహ్హ్యింది రాకేష్ మాస్టరే. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరించాడు.అదే విధంగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించి పలు ఎపిసోడ్లలో కనిపించి నవ్వులు పూయించారు. 2020 సంవత్సరంలో గ్లోబల్ హ్యమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్‌కు డాక్టరేట్ ప్రకటించారు. రాకేష్ మాస్టర్ కు ముగ్గురు భార్యలు.. ఇద్దరు పిల్లలు అని సమాచారం. ప్రస్తుతం రాకేష్ మాస్టర్ పార్ధీవ దేహాన్ని.. గాంధీ హాస్పిటల్ నుంచి బోరబండలోని ఆయన స్వగృహానికి తరలించారు.