Priya Varrier : అజిత్ లాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజులకి అజిత్ మాస్ ఎలివేషన్స్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. త్రిష ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, అర్జున్ దాస్ విలన్‌గా కనిపించాడు. ఇందులో యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ‘తొట్టు తొట్టు’ పాటతో విశేష స్పందన అందుకుంది. దీంతో తాజాగా ఈ మూవీ జర్నీ పై ప్రియా ప్రకాష్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందం వ్యక్తం చేసింది.
Also Read: SSMB29 : మహేష్, రాజమౌళి బిగ్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఇదేనా..?
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
‘ నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. అజిత్ సార్ అంటే నాకెంతో అభిమానం. చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. ఫస్ట్ డే నుంచి షూట్ చివరి రోజు వరకు మీరెంతో సపోర్ట్ చేశారు. నేను కూడా టీమ్ భాగమేననే భావన కలిగించేలా ధైర్యం చెప్పారు. సెట్‌ల్లో ఎవరూ ఇబ్బందిపడకుండా ఉండేలా మీరు అందరితో చాలా కలివిడిగా ఉండేవారు. ముఖ్యంగా షిప్‌ల్లో షూట్ చేసిన రోజులను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మనమంతా కలిసి భోజనం చేయడం.. సరదాగా మాట్లాడుకోవడం నాకు ఎంతో నచ్చింది. మీలాంటి మంచి వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. కుటుంబం, కార్లు, రేస్, ట్రావెలింగ్ గురించి మాట్లాడేటప్పుడు మీ కళ్ళలో ఇక మెరుపు కనిపిస్తుంది . వృత్తిపై మీకున్న నిబద్ధత, సహనం, నాలాంటి ఎంతోమంది కొత్తతరం నటీనటులకు స్ఫూర్తి సార్. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణాలు మీ నుంచి నేర్చుకున్నా. ‘తుట్టు తుట్టు’ పాటలో మీతో కలిసి వర్క్ చేయడం నా జీవితంలో మర్చిపోలేను’ అని ప్రియా రాసుకొచ్చింది.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!