వరంగల్‌కు మంజూరైన సైనిక్ స్కూల్ ను రీ లోకేట్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమ పలుకుబడిని ఉపయోగించి దేశవ్యాప్తంగా ప్రారంభించే 100 సైనిక్ స్కూళ్లలో అదనంగా ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు కొత్తగా విద్యాసంస్థలు తేకున్నా పర్వాలేదు , రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వరంగల్లోనే సైనిక్ స్కూల్ ను నెలకొల్పాలని, గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందన్నారు కడియం శ్రీహరి.
గత ప్రభుత్వం ప్రజల సమస్యలు గుర్తించి అనేక పనులను మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్న నమ్మకం నాకు లేదన్నారు కడియం శ్రీహరి. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కొత్త పనులను మంజూరు చేయకున్న , గత ప్రభుత్వ పనులను రద్దు చేయకుండా చూడాలన్నారు కడియం శ్రీహరి. ఈనెల 31 తో సర్పంచుల పదవీకాలం ముగుస్తుందన్నారు. సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని, కొత్తగా ఏర్పాటు చేసుకున్న గ్రామపంచాయతీ భవనాలను ఇప్పుడున్న సర్పంచుల టర్ములోనే ప్రారంభించుకునేలా మరో ఆరు నెలలు కాలాన్ని పొడిగించాలన్నారు కడియం శ్రీహరి.