KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వున్న 20 వేల ఎకరాల్లో 10 వేల ఎకరాల్లో వందలాది కంపెనీలను తీసుకువస్తా.. పది లక్షల ఉద్యోగాలిస్తాం అని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మే డే సందర్భంగా ఉక్కుపరిరక్షణ పోరాటంలో వున్న 27 మంది నాయకులను కలిశాను.. 810 రోజుల పాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు పోరాడుతున్నారని తెలిపారు.. ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రైవేటీకరణ ఆగి తీరుతుందన్న పాల్.. విశాఖ ఉక్కు అదానీది కాదు, గుజరాతీలదు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వున్న 15 కోట్ల మంది తెలుగువారిదన్నారు.. అయితే, స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రధాని మోడీ ప్లాన్డ్ గా నిర్ణయాలు చేస్తున్నారని విమర్శించారు.. స్టీల్ ప్లాంట్ కు చెందిన 20 వేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Priyanka Gandhi: అగ్రనేతలు కోరితే రాజీనామా చేస్తానన్న బ్రిజ్‌భూషణ్.. ప్రధానికి ట్యాగ్ చేసిన ప్రియాంక
ఏపీలో రాజకీయ పార్టీల బలహీనత చూసుకుని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలు చేస్తున్నారని ఆరోపించారు కేఏ పాల్.. పార్టీలకు అతీతంగా పోరాడాలి.. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోపోతే తెలుగు జాతికే అవమానం అన్నారు.. 17 లక్షల కోట్ల ఆస్తిపరుడైన అదానీ.. దేవుని శాపం వల్ల నెలలోనే 7 లక్షలకు తగ్గిపోయాడన్నారు.. మరీ ముందుకు వెళ్తే వున్నది కూడా పోతుంది. స్టీల్ ప్లాంట్ జోలికి ఎవరు వచ్చినా దేవుని శాపం పొందకుండా ఉండరంటూ కామెంట్ చేశారు. ఇక, నాకు పర్సనల్ ఎజెండాలు లేవు.. ఏమి చేసిన ప్రజలకోసమే అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.