KA Paul: జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ పేరిట కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక చీకటి రోజుగా గుర్తిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని పెట్టారని.. కానీ ఆయన ఆర్ఎస్ఎస్ సపోర్టర్ అంటూ ఆరోపించారు. వంద కోట్లకు, వెయ్యి కోట్లకు అమ్ముడు పోవడమా అంటూ విమర్శలు గుప్పించారు. జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీ మూసేసారని, షర్మిల పార్టీ మూసేసారని, ఆయన కూడా మూసేస్తారని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్‌లు నా పార్టీలో చేరారన్నారు.
Read Also: Eggs Price : మరోసారి పెరిగిన కోడిగుడ్డు ధర.. ఎందుకు పెరిగిందంటే?
Also Read
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
గతంలో కూడా కేఏ పాల్ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు.. తాను తప్ప వేరే ఎవరు తీర్చలేరని కేఏ పాల్ తెలిపారు. కనీసం వడ్డీలు కూడా కట్టలేరని.. సాకులతోనే కాలం గడిపేస్తారంటూ చెప్పుకొచ్చారు. దేశంలో, రాష్ట్రంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలని కేఏ పాల్ సూచించారు. ప్రజాశాంతి పార్టీకి త్వరలోనే గుర్తు కూడా రానుందని కేఏ పాల్ వెల్లడించారు. ఇక.. టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను రూ.50 కోట్లు అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ రూ.1000 కోట్లు ఇచ్చిందని ఆరోపించారు. గతంలో.. తనను విదేశాంగ శాఖ మంత్రిగా ప్రభుత్వంలోకి రావాలని మోడీ, అమిత్ షా కోరారని.. కానీ తాను వెళ్లలేదని కేఏ పాల్ తెలిపారు.
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!