గతనెలలో కార్తీకమాసం కారణంగా నాన్ వెజ్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. కిలో చికెన్ ధర కూడా 100 కేజీ పలికింది.. ఈ వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి.. అదే విధంగా కోడి గుడ్డు ధరలు కూడా కొండేక్కి కూర్చున్నాయి.. కేవలం వారం రోజుల్లోనే ధరలు మరోసారి పెరిగాయి.. హైదరాబాద్ లో కోడి గుడ్డు ధర భారీగా పెరిగింది..
రెండు వారాల కింద ఒక్కో గుడ్డు రూ.6 ఉండగా, ఇప్పుడు రూ.7కు చేరింది. హోల్ సేల్లో ఒక్కో గుడ్డు రూ.5.80 పలుకుతోంది. కొన్ని రోజులుగా చలి బాగా పెరిగింది. దీంతో వెచ్చదనం కోసం ఆహారంలో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఎగ్స్కు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు.. మిగితా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో కోడిగుడ్ల వాడకం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు..
గుడ్ల ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తుంది.. అందులో కార్తీకమాసం ముగియడంతో ధరలు పెరిగాయి. అలాగే, కోళ్ల దాణా ధరలు రెట్టింపు అవ్వడం కూడా గుడ్ల ధరలు పెరగాడానికి కారణమని సుబ్బరాజు చెప్పారు. గతంలో కరోనా టైమ్ లో గుడ్ల వినియోగం పెరిగిందని, ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ప్రచారంతో చాలామంది ఎగ్స్ తింటున్నారన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలోనే కోడిగుడ్ల ఉత్పత్తి ఎక్కువ. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న ఎగ్స్ లో దాదాపు 50 శాతం ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.. ఇక రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. మరోవైపు చికెన్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి..