Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
- కీలక నేతలకు అవకాశం
- ఈనెల 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు పార్టీ కీలక నేతలను రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌కు అవకాశం కల్పించింది.
మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌తో పాటు రజనీష్ అగర్వాల్‌ను కూడా రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. ఒడిశాలో ఇటీవల బీజేడీని వీడి బీజేపీలో చేరిన మాజీ నేత దేవాశిష్ సామంత్రాయ్‌ను ఉప ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ నుంచి తై తగక్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ రాష్ట్రం నుంచి రాజుభాయ్ శుక్లా, ముకేశ్‌భాయ్ రాథ్వా, మాన్సింగ్ పర్మార్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. రాజస్థాన్‌లో ఆల్కా గుర్జర్, సతీశ్ పూనియాలకు బీజేపీ అవకాశం కల్పించింది. మణిపూర్ నుంచి ఏ. శారదా దేవిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
దేశవ్యాప్తంగా ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. పలు రాష్ట్రాల్లో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఒడిశాలో ఇటీవలే బీజేపీలో చేరిన దేవాశిష్ సామంత్రాయ్కు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ తన విస్తరణ వ్యూహాన్ని కొనసాగిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
27 రాజ్యసభ స్థానాల్లో పోలింగ్..
దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 27 రాజ్యసభ స్థానాలకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
BJP has nominated BJP national general secretary Tarun Chugh as its Rajya Sabha candidate from Madhya Pradesh.
Debashish Samantray, a former BJD leader who recently joined the BJP, has been announced as the Odisha Rajya Sabha by-election candidate. https://t.co/A33a4SSgCf
— ANI (@ANI) June 4, 2026
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..