ఎన్టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీవీ పాడ్ క్యాస్ట్ షోలో తాజాగా మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ షోలో ఆయన అనేక విషయాలను ప్రేక్షకులలో పంచుకున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 'జై భారత్ నేషనల్ పార్టీ' పేరిట కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక చీకటి రోజుగా గుర్తిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.