Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
- కొన్ని వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టడం ప్రమాదం..
- పాడవడంతో పాటు పోషక విలువలు తగ్గే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Tips: వేసవి వచ్చిందటే చాలా, మన ఇళ్లలోని ఫ్రిజ్‌లు వస్తువులతో నిండిపోతాయి. అవసరం ఉన్నా, లేకున్నా ఫ్రిజ్‌లో ఖాళీ ప్లేస్ ఉంటే చాలు వాటిని అందులో పెట్టేస్తాము. అయితే, కొన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచితే, అవి తాజాగా ఉండటానికి బదులుగా చెడిపోయే ప్రమాదం ఉందని, ఆరోగ్యానికి హాని కలిగించే విషంగా మారుతాయి.
బంగాళదుంపలు:
రిఫ్రిజిరేటర్లోని చల్లని గాలి బంగాళాదుంపలలోని పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది. దీనివల్ల బంగాళాదుంపలకు విచిత్రమైన తీపి రుచి వస్తుంది మరియు వండినప్పుడు వాటి రంగు ముదురుగా మారుతుంది. బంగాళాదుంపలను ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్లో కాకుండా, ఒక బుట్టలో పెట్టి, చీకటిగా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి.
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
వెల్లుల్లి-ఉల్లిపాయలు:
వెల్లుల్లి-ఉల్లిపయాల్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేయకూడదు. ఫ్రిజ్‌లోని తేమ వల్ల ఉల్లిపాయాలు మెత్తగా మారి, బూజు పట్టడానికి కారణమవుతుంది. వెల్లుల్లి ఫ్రిజ్‌లో ఉంచితే మొలకెత్తి, రబ్బరులా గట్టిగా తయారవుతుంది. వీటి వల్ల ఫ్రిజ్‌లో వాసన వస్తుంది.
టమోటోలు:
టమోటోలను కూడా ఫ్రిజ్‌లో పెట్టవద్దు. కూలింగ్ వల్ల టమోటోల పై పొర దెబ్బతింటుంది. మెత్తాగా మారి, వాటి అసలైన రుచి కోల్పోతాయి.
తేనె:
తేనె బయట ఉంచితే పాడవుతుందనే అపోహ ఉంటుంది. దీంతో ప్రజలు దీనిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. తేనె వందల ఏళ్ల పాటు పాడవని ఆమారం. దీనిని ఫ్రిజ్‌లో ఉంచితే చిన్న స్పటికాలుగా మారి, చిక్కగా, గట్టిగా తయారవుతుంది.
చపాతీ:
చపాతీ వంటి వాటిని కూడా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. దీని వల్ల అవి ఆరిపోతాయి. గట్టిగా మారి తినేందుకు కష్టంగా ఉంటాయి.
కాఫీ పొడి:
కాఫీ పొడిని లేదా గింజలను రిఫ్రిజిరేటర్లో ఉంచొద్దు. అవి స్పాంజిలా చుట్టుపక్కల ఉన్న ఆహార పదార్థాల నుండి తేమను, వాసనలను పీల్చుకుంటాయి. దీని వల్ల అవి వాటి రుచిని, వాసనను కోల్పోతుంది.
అరటి పండ్లు, పుచ్చకాయ:
అరటిపండ్లను ఎప్పుడూ వేడి వాతావరణంలో ఉంచడం మంచింది. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే వాటి తొక్కలు నల్లగా మారుతాయి. ఫ్రిజ్‌లోని చల్లదనం తొక్కలోని కణాలను దెబ్బతీస్తుంది. పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ఇలా చేస్తేనే దీని లోని యాంటీఆక్సిడెంట్లు చెక్కుచెదరకుండా ఉంటాయి. అయితే, కోసిన తర్వాత ముక్కల్ని ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.
తాజావార్తలు
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!