Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఈ మధ్య తెలంగాణలో చేసిన వ్యాఖ్యలపై పెద్ద రచ్చ మొదలైంది.. దీంతో, ఆ తర్వాత తెలంగాణపై తన వైఖరిని చెబుతూ వచ్చిన ఆయన.. ఇప్పుడు తెలంగాణ అంశంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చర్చనీయాంశంగా మారిన సెక్షన్-8 అమలుపై తాను గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు పవన్ కల్యాణ్..
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సెక్షన్-8 అమలు ఉండకూడదని తాను అప్పట్లోనే చెప్పానని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల స్వయం పాలనా హక్కులను గౌరవించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలు, ప్రయోజనాలను సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన భద్రతా ఆందోళనలను గుర్తిస్తూ, అదే సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ అభిప్రాయపడ్డారు. వివాదాస్పద అంశాల పరిష్కారానికి సెక్షన్-8 కంటే ప్రత్యేక సమన్వయ వ్యవస్థలు, పరస్పర చర్చలు, అవగాహనతో కూడిన విధానాలే మెరుగైన పరిష్కారమని ఆయన తెలిపారు.
Also Read
పార్లమెంటరీ పర్యవేక్షణ, రెండు రాష్ట్రాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు దీర్ఘకాలిక పరిష్కారానికి దోహదపడతాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణను అస్థిరపరిచే రాజకీయాలకు తాను ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణే తన లక్ష్యమని పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పర గౌరవం, శాంతి, సహకారం, సోదరభావంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయడం ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. తన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్‌ను తగ్గించే విధంగా పాత వీడియోను షేర్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..
My stand on Telangana and the interests of its people has always been consistent.
Following the bifurcation of Andhra Pradesh, while certain law and order concerns were raised, I clearly opposed the implementation of Section 8, as I believed it would undermine the self-respect… pic.twitter.com/6VVtTsTRkU
— Pawan Kalyan (@PawanKalyan) June 4, 2026
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!