విజయవాడలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తానని పాల్ అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మందు తాగి వచ్చాడో, డ్రగ్స్ కొట్టి వచ్చాడో ఏదేదో వాగాడు.. పవన్ ప్యాకేజీ స్టార్… సిగ్గు, బుద్ధి లేదా పవన్ కి.. మాయావతి కాళ్ళు పట్టాడు.. పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను అని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు.
Read Also: Bhola Shankar: భోళా శంకర్ సినిమా నిలిపివేత.. థియేటర్ సీజ్
పవన్, చిరంజీవిలపై సీబీఐ ఎంక్వైరీ వేయిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ని అమ్మడం జరగదని తేగలవా.. పవన్ కి మాట్లాడటం రాదు, ఇంగ్లీషు రాదు అని అమిత్ షా నాకు చెప్పాడు.. ఏపీ మీద ప్రేమ లేని వాడు జనసేనలో చేరతాడు.. బుద్ధి బుర్ర లేకుండా మాజీమంత్రి ఎవరో జనసేనలో చేరిందట.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు.. పవన్ జనసేనాను బీజేపీలో విలీనం చేస్తాడు అంటూ కేఏ పాల్ విమర్శలు చేశాడు.
Read Also: Basara IIIT: వీకెండ్ విత్ వీసీ.. విద్యార్థుల సమస్యలు నేరుగా చెప్పుకునే ఛాన్స్
చిటికేస్తే ఏపీ సీఎం జగన్ ను, వైసీపీ ఎమ్మెల్యేలను జైలులో పెట్టిస్తాననడానికి పవన్ కళ్యాణ్ ఎవరు అని ప్రజాశాంతి చీఫ్ కేఏ పాల్ అడిగారు. పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో మోడీ యాత్ర చేయడానికి పవన్ కు సిగ్గులేదా అని అన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మడం లేదని మోడీతో ఆర్డర్ తీసుకురా.. బీజేపీ, టీడీపీని తిట్టి బయటకు వచ్చి మళ్లీ 15 సీట్ల కోసం టీడీపీతో పవన్ అంటకాగుతున్నాడు.. పవన్, చిరంజీవి ప్యాకేజీ స్టార్లు వాళ్ల మాటలు ప్రజలు నమ్మొద్దని కేఏ పాల్ చెప్పుకొచ్చాడు.