తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు రెండు నెలలు వాయిదా వేయండి కొత్త సబ్జెక్ట్ ఇప్పుడే వచ్చింది అని కేసీఆర్, కేటీఆర్‌ను అడిగితే వాయిదా వేయలేదని, నేను చీఫ్ జస్టిస్‌ను కలిసి వాయిదా వేయమని అడిగా.. త్వరలో అభ్యర్థులు శుభవార్త వింటారన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్. ఇవాళ కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. వాయిదా వేయించే బాధ్యత నాది అని, ఎవరూ కూడా సూసైడ్ చేసుకోకండి అని ఆయన అన్నారు. నేను, నా కోడలు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రలో వాయిదా వేయించామని, ఈ ముఖ్యమంత్రులకు బుద్ధి ఉండొద్దా…. కేసీఆర్ కు మతిమరుపు వస్తే కొడుకు చెప్పకూడదా అని ఆయన అన్నారు.
Also Read : Rahul Gandhi: విదేశాల బాట పట్టనున్న కాంగ్రెస్ అగ్రనేత.. సెప్టెంబర్లో యూరప్కు రాహుల్
ఒరేయ్ రేవంత్ ఓ తండ్రిలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉరి తీయమంటావా.. నువ్వెలా పీసీసీ అధ్యక్షుడవయ్యావ్.. ఒరేయ్ ఆకునూరి మురళి నువ్వెలా కలెక్టర్ అయ్యావ్…. తుపాకులు పట్టుకోమని అంటావా…. ఆగస్ట్ 21 న మీటింగ్ పెడుతున్న.. 10 స్థానాల్లో పోటీ చేస్తాం.. భారీ మెజారిటీ తో గెలుస్తున్నాం.. పొంగులేటి మాయలో ఎవరూ పడొద్దు… ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేయలేదా…. మీ ముందుకు,బిర్యానికి అమ్ముడుపోతామా పొంగులేటి.. పొంగులేటి మొన్న పెట్టిన మీటింగ్ లో 70 వేల కుర్చీలను నింపలేకపోయారు…. 2 శాతం ఉన్న మీరే పాలించాలా.. దళితులం పాలించకూడదా…. రైతుబంధు 20 వేలు చేస్తా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ పాలన తీసుకొస్తా…. మణిపూర్ లో క్రైస్తవులను ఊచకోత కొస్తుంటే ఇక్కడి నాయకులు మాట్లాడారా….. గద్దరన్న చివర కోరిక నెరవేర్చాలి.. ఇంటింటా ప్రజాశాంతి రావాలని గద్దర్ అన్నాడు…గద్దర్ చావలేదు, గద్దర్‌ను చంపేశారు… అనేక ఒత్తిళ్లు తెచ్చి చనిపోయేలా చేశారు…. రెడ్లోద్దు, కమ్మలు వద్దు, బ్రహ్మిన్స్ వద్దు అన్నాడు…. సిగ్గుంటే ప్రజలారా అందరూ అన్నిపార్టీలు వదిలి ప్రజాశాంతిలోకి రండి.. బంగారు తెలంగాణలో రోడ్లన్నీ నాశనము అయినవి.. బైబై మోడీ, బై బై కేసీఆర్…. ప్రజల వద్దకు పాల్ వస్తున్నాడు…. దోచుకునే పాల్ కాదు…. ఈ కుల పార్టీలకు ఒత్తియకండి…. అభివృద్ధి కావాలంటే నాతో రండి…’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
Also Read :