రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా నేతన్నలు శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. గత ప్రభుత్వంలో నేత కార్మికులకు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. 8 కోట్ల మీటర్ల బట్టతో చీరెలు ప్రభుత్వం నుండి ఆర్డర్ నేతన్నలు ఇస్తున్నామని, నేత కార్మికులకు భవిష్యత్లో hiit ద్వారా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నేత కార్మికులు సిరిసిల్లలో అనేక ఆత్భుతాలు చేస్తున్నారని, ఆధునిక యంత్రాలు తీసుకొచ్చి నేత కార్మికులకు పని కల్పిస్తామని ఆయన వెల్లడించారు. సిరిసిల్ల పట్టణ పద్మశాలలకు లబ్ధి చేకూరింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనతనే అని, గత ప్రభుత్వంలో నేత కార్మికులకు అంత్యోదయ కార్డులు తొలగించిందన్నారు కేకే మహేందర్ రెడ్డి.గత ప్రభుత్వ కుటిల నీతి తో నేత కార్మికుల కరెంటు సబ్సిడీ తీసివేసిందని, సిరిసిల్లలో యారాన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Mamata Banerjee: ‘‘రాత్రులు నిద్ర పోలేదు’’.. నిరసన తెలుపుతున్న వైద్యుల వద్దకే సీఎం మమతా బెనర్జీ..
అంతేకాకుండా..’బ్యాంకుకు లింకేజి చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం gst వేసి నేత కార్మికుల నడ్డి విరిచిచింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరెలు డిస్టి బొమ్మలకు కట్టినారు. మేము నాణ్యమైన సంవత్సరానికి రెండు చీరెలు ఇస్తాం. జీవో 1 తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో చేస్తున్న మహిళలకు సంబంధించి బట్టను నేత కార్మికులకు ఆర్డర్ ఇస్తున్నాం. డిల్లీలో మకాం వేసి బావ బమ్మర్ధులు కవిత బెయిల్ కోసం చేయని ప్రయత్నం లేదు. కవితకు బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషిగా కోర్టు నిర్ధారించలేదు. అరెకపూడి గాంధీ ఇప్పటికీ టీఆర్ఎస్ లో ఉన్నాడు. గాంధీకి pac పదవి ఇస్తే ఆ నాయకులు జిర్ణించుకుంటలేదు. టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన వాళ్ళు చిన్న పిల్లలు కాదు. టీఆర్ఎస్ పార్టీ దోచుకున్న సొమ్ము వరద బాధితులకు ఇవ్వాలి. హైడ్రా రాగానే మొదటగా కోర్టు కి ముందుగా వెళ్ళింది కేటీఆర్ బినామీ.’ అని కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
Gyanvapi Mosque: “జ్ఞానవాపి మసీదు నిజానికి శివాలయమే”.. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..